గ్లామ్ అప్ ఫెస్ట్ 2024 సెకండ్‌ ఎడిషన్‌ లాంచ్‌, మూడు రోజులపాటు | Flipkar thosts The second edition of Glam Up Fest 2024 | Sakshi
Sakshi News home page

గ్లామ్ అప్ ఫెస్ట్ 2024 సెకండ్‌ ఎడిషన్‌ లాంచ్‌, మూడు రోజులపాటు

Published Fri, Jun 14 2024 11:47 AM | Last Updated on Fri, Jun 14 2024 11:49 AM

Flipkar thosts The second edition of Glam Up Fest 2024

భారతదేశంలోని అతిపెద్ద బ్యూటీ ఈవెంట్  ‘గ్లామ్ అప్ ఫెస్ట్ 2024’ రెండో ఎడిషన్‌  షురూ అయింది.   స్వదేశీ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా జూన్ 14 నుండి జూన్ 17 వరకు  జరిగే ఈ ఈవెంట్‌లో గ్లామ్ అప్ సేల్‌తో పాటు ప్రీమియం, స్వదేశీ D2C బ్రాండ్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.  అందం, సౌందర్య సాధనాలు, చర్మ సంరక్షణ, సువాసన ఉత్పత్తుల అద్భుతమైన డీల్స్‌ అందిస్తుంది. ఇంకా సరికొత్త లాంచ్‌లు, డీల్స్ , సిగ్నేచర్ కలెక్షన్స్‌, బ్రాండ్  లాంచింగ్స్‌, ఇంటరాక్టివ్ యాక్టివిటీలు,  ఫ్యాషన్‌ షో, ప్రోడక్ట్ ట్రయల్స్ డెడికేటెడ్‌  ఫోటో  అండ్‌ వీడియో స్టేషన్లు ఉంటాయి.

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రకటించిన ఈ గ్లామ్ అప్ ఫెస్ట్ సెకండ్‌ ఎడిషన్‌లో 3,500+ బ్యూటీ అండ్ లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ఏకం చేసే ఈ గ్రాండ్ ఈవెంట్‌లో 70కిపైగా  టాప్‌ బ్రాండ్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.  గ్లామ్ అప్ ఫెస్ట్ లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం అద్భుతమై ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తోందని ఫ్లిప్‌కార్ట్‌  FMCG అండ్‌ జనరల్ మర్చండైజ్ బిజినెస్ హెడ్ మంజరీ సింఘాల్  తెలిపారు. తమ కస్టమర్లకు ఈ ఈవెంట్‌ చక్కటి బ్యూటీ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు.

స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్‌లను ఒకే తాటిపైకి తీసుకువస్తూ, ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్  గ్లామ్ అప్ ఫెస్ట్‌ను తాప్సీ పన్ను, సిద్ధాంత్ చతుర్వేది, రోహిత్ సరాఫ్, అదా శర్మ , పష్మీనా రోషన్‌లతో సహా  పలువురు  ఈ ఫెస్ట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. వర్చువల్ ట్రై-ఆన్, వీడియో కామర్స్, స్కిన్ ఎనలైజర్‌లు లాంటి వినూత్న సాధనాలతో ఫ్లిప్‌కార్ట్ , AR , VR సామర్థ్యాలను  కూడా ఉపయోగించుకోవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement