How To Prevent Cyber Crime Attacks: How To Delete Unwanted Photos From Social Media - Sakshi
Sakshi News home page

ఏంటిది.. నాకు తలకొట్టేసినట్టు అయ్యింది.. ఆ ఫొటోలు, వీడియోలను ఎలా తొలగించాలి?

Mar 10 2022 10:04 AM | Updated on Mar 10 2022 5:11 PM

Cyber Crime Preventing Tips: How To Delete Unwanted Photos From Social Media - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Cyber Crime Preventing Tips: ‘సోనీ తింటున్నప్పుడు కూడా ఆ ఫోన్‌ ఎందుకు’ అరిచిన అమ్మ మీద విసుక్కుంది సోనీ. ఆఫీసు నుంచి వచ్చిన సోనీ తండ్రి భార్య మీద కోప్పడ్డాడు ‘తల్లిగా కూతురుకి ఏది మంచిదో, కాదో చెప్పలేవా... సోషల్‌ మీడియాలో ఏంటా ఫొటోలు. నాకు ఆఫీసులో తలకొట్టేసినట్టుగా అయ్యింది తెలుసా!’ అని అరిచాడు.

ఆ మాటలకు ‘ఇదేమైనా నేనొక్కదాన్నే చేస్తున్నానా.. ఎంత మంది ఎలా ఉంటున్నారో చూడట్లేదా?’ అని తండ్రిని ఎదురు ప్రశ్నించింది సోనీ. ప్రశాంతంగా ఉన్న కుటుంబ వాతావరణం ఒక్కసారిగా విసుగులు, చిరాకులు, గొడవలవైపుగా సాగింది సోషల్‌మీడియా కారణంగా. 

ఇదొక్కటే కాదు... ఈ రోజుల్లో ఏం చేసినా, ఏం చెప్పినా, ఎలా ఉన్నా.. లేచిన దగ్గర నుంచి పడుకునేవరకు సోషల్‌ మీడియా ప్రపంచంలో తిరిగేవారే ఎక్కువ. అలాంటి ఈ ప్రపంచంలో దారి తెన్నూ లేకుండా తిరిగితే అభాసుపాలవడం ఖాయం. మరెలా ఉండాలి?!  అనే ప్రశ్న మీదైతే.. సమాధానాలు ఇవే! 

ప్రతికూలతలు
వ్యక్తులు, సంస్థలు, రాజకీయ నాయకులతో సహా సమాజంలోని అన్ని వర్గాల నుండి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను చూస్తున్నాం. అందుకే, భద్రత అనే విషయమై సోషల్‌ మీడియాను సెన్సార్‌ చేయాలనే ఆలోచనలకు పునాది రాయి పడింది. వినియోగదారులు తమ సైట్‌లలో, సామాజిక మాధ్యమాలలో వారి వ్యక్తిగత సమాచారాన్ని అందజేస్తుంటారు.

తర్వాత ఉపయోగించడానికి సేవ్‌ చేస్తారు. అంటే, ఈ చర్యలన్నీ ప్రతి ప్రవర్తనా అంశం డాక్యుమెంట్‌ చేయడానికి వీలుగా, వాణిజ్య మాధ్యమానికి ఉపయోపడేలా ఉంటుంది. కంపెనీలు మీరు వాడిన పదాలు, చర్యలు, సంభాషణలు, ఫొటోలను దొంగిలించి, వాటిని సందర్భం లేకుండా అనాలోచితంగా పబ్లిక్‌ చేసేయొచ్చు. 

ఆ చిత్రాలు, వీడియోలను ఎలా తొలగించాలి...
గూగుల్‌: సెట్టింగ్‌లపై క్లిక్‌ చేయండి. అందులో తొలగింపు ఆప్షన్‌ను ఎంచుకొని, దానిపై క్లిక్‌ చేయండి. 
ట్విటర్‌ : https://support.twitter.com/%20form/private_information
ఫేస్‌బుక్‌: ఫొటో/వీడియోపై క్లిక్‌ చేసి, ఎగువ కుడివైపు ఉన్న డ్రాప్‌ డౌన్‌ చేయండి. ‘నా ఈ ఫొటో నచ్చలేదు. ఈ పోస్ట్‌ని నిషేధించండి’ పైన క్లిక్‌ చేయండి. సంబంధిత ఎంపికను ఎంచుకోండి అంటే ‘అది ఫేస్‌బుక్‌లో ఉండకూడద’ని అనుకుంటున్నాను’ అనే విషయం క్లియర్‌ అయిపోతుంది. 
యూ ట్యూబ్‌: ప్లేయర్‌ దిగువన ‘మోర్‌’ అనే బటన్‌పై క్లిక్‌ చేసి, డ్రాప్‌డౌన్‌ మెనూలో రిపోర్ట్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి. వీడియో ఉల్లంఘనకు సరిపోయే కారణంపై క్లిక్‌ చేయండి. 

టాప్‌ 10 మర్యాదలు:
మీ సోషల్‌ మీడియాలో ఏది బాగుంది అనే దాని ఆధారంగా ‘ఎక్కడ ఆహారం తినాలో’ నిర్ణయించుకోవద్దు. ఇతరుల పోస్టింగ్‌లో వివిధ రకాల డ్రెస్సులు చూసి, వాటిని కొనుగోలు చేయాలనుకోవద్దు. సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడం కోసం జిమ్‌ లేదా వ్యాయామశాలలో అతిగా వ్యాయామాలు చేయాలనుకోవద్దు. 
మీకు హాస్యం అనిపించేది ఇతరులకు హాస్యం కాకపోవచ్చు. వ్యక్తీకరణలో జాగ్రత్త అవసరం. 
ఉపయోగంలో లేనప్పుడు అన్ని సోషల్‌ మీడియా అప్లికేషన్‌లను లాగ్‌ ఆఫ్‌ చేయడం అత్యుత్తమం. లేకపోతే మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్‌లు విడుదల చేసే సమాచారం వ్యసనానికి దారితీయడమే కాకుండా చాలా పరధ్యానాలకు కారణమవుతుంది. 
మీరు ప్రతికూలంగా భావించే విషయాలను పోస్ట్‌ చేసే ఖాతాలను అనుసరించడం వలన మీపైన కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. 
 

నిజ జీవితంలోనే ఇప్పటికే తగినంత పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌ ప్రపంచం లో పోటీ పడటం అంతగా అవసరం లేదు. మీ ఇష్టాలు మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం కాదని గుర్తుంచుకోవాలి. ఆఫ్‌లైన్‌–ఆన్‌లైన్‌ రెండింటినీ ఒకేవిధంగా పరిగణించాలి. 
మిమ్మల్ని ఇతరులు ఎలా చూడాలని కోరుకుంటున్నారో, మీ సోషల్‌ మీడియా యాక్టివిటీ ఆధారంగా ఇతరులు మిమ్మల్ని అలాగే చూస్తారని అది ప్రతిబింబం అని గుర్తించాలి. 
మీ వ్యాఖ్యలను ఇష్టపడనివారు, బెదిరింపులకు పాల్పడేవారు, ప్రతికూల వ్యాఖ్యలను వెలువరించేవారితో డిస్‌కనెక్ట్‌ అవడం మంచిదే అని నిర్ధారించుకోండి. 
మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేసేంతగా వర్చువల్‌ ప్రపంచంలో కోల్పోకండి. మీ పుట్టినరోజుకు సోషల్‌మీడియాలో ఒక లైక్‌ ఇవ్వని స్నేహితుడు, మిమ్మల్ని నేరుగా కలిసి కరచాలనం చేస్తారు.
అభివృద్ధి వైపుగా ప్రయాణించే క్రమంలో కొత్త లోకం చూడాలనుకున్నట్టే, అక్కడ కొత్త సమస్యలు కూడా ఎదురవుతాయి. మన గోప్యతా సెట్టింగ్‌లు మనమేంటో చూపుతాయి.

సమాజంలోని వారితో మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి వ్యక్తిగత వివరాలు, నమ్మకాలు, ప్రాధాన్యాలు స్వచ్ఛందంగా బహిర్గతం చేస్తుంటాం. అందుకు సంబంధించిన కంటెంట్‌ కూడా అనేక అంశాలలో చాలా సులువుగా సందర్భోచితంగా ఉంటుంది. మనలో చాలా మంది సోషల్‌ మీడియా ఖాతాలను పూర్తిగా సోషల్‌వెంట్‌గా పరిగణిస్తారు. సాధారణంగా స్టేటస్‌లను అప్‌డేట్‌ చేయడం, సోషల్‌ ప్లాట్‌ఫారమ్‌లలో ఫొటోలను పోస్ట్‌ చేయడం ద్వారా స్నేహితులు, ఫాలోవర్లు మీ అభివ్యక్తీకరణ గురించి ఏం అనుకుంటున్నారో అనే చిన్న అంచనాకు వస్తారు. మీ ఆన్‌లైన్‌ చర్యలు భవిష్యత్తులో విద్యా, వ్యక్తిగత లేదా వృత్తిపరమైన అవకాశాలను తీవ్రంగా పరిమితం చేయచ్చు.  

మీ సమాచారాన్ని పంచడం నియంత్రణకు కుకీలను బాక్‌ చేయండి. గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్‌ చేయండి.
ఒక పెద్ద అక్షరం, ఇతర సంక్లిష్టమైన అక్షరాలతో పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి. ∙చిత్రాలు చూసేటప్పుడు, అప్‌లోడ్‌ చేస్తున్నప్పుడు లొకేషన్‌ లీక్‌ కాకుండా చూడండి. 
’ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సున్నితమైన సమాచారాన్ని ఎప్పడూ షేర్‌ చేయవద్దు. ముఖ్యంగా ఆర్థిక, సంస్థ, వ్యక్తిగత సమాచారం మీ పరిధిలోనే ఉండటం ముఖ్యం. సోషల్‌ మీడియాను ఉపయోగించేటప్పుడు స్మార్ట్‌ ఫోన్‌కన్నా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల వాడకం మేలు.
మీకు తెలిసిన, నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్‌ అవ్వండి. 
-అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్,  ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement