‍మీకు తెలుసా!..బ్రెడ్‌తో పాదాల పగుళ్లు మాయం! | Sakshi
Sakshi News home page

‍మీకు తెలుసా!..బ్రెడ్‌తో పాదాల పగుళ్లు మాయం!

Published Fri, Sep 8 2023 2:06 PM

Cracked Heels: Wrapping Bread Slice Around Your Foot Get Rid This Issue - Sakshi

కోమలంగా ఉండాల్సిన పాదాలు కాస్త చూసేందుకు అస్యహంగా ఉన్నాయా!. కనీసం బయటకువెళ్లలేని స్థితిలో ఉన్నారా. మరోవైపు  ఆ పగుళ్లు వల్ల వచ్చే బాధ కారణంగా చన్నీటిలో పాదాలు పెట్టాలన్న భయం వేస్తుంది. ఎన్నో క్రీంలు వాడినా పాదాల పగుళ్లు సమస్య నుంచి బయటన పడలేక పోతుంటే ఈ చక్కటి చిట్కాను ఫాలోకండి. మంచి ఫలితం ఉంటుంది. ఏంటీ.. దీంతోనా! అని షాక్‌ అవ్వద్దు!. 

వర్షాకాలం లేదా శీతాకాలం వస్తే అందర్నీ వేధించే సమస్యే కాలు పగుళ్లు ఓ పట్టాన నయం కావు. పైగా మరింత పెద్దవై రక్తం కారి నొప్పి కూడా వస్తుంటుంది. చెప్పులు వేసుకుని నడవాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓ పక్క ఎవ్వరైన ఈ పగుళ్లు చూసి అసహ్యించుకుంటారేమోనని భయపడతాం. అందుకని అవికనిపించకుండా ఉండేలా సాక్స్‌ వంటి ఉపయోగించి మరీ దాచే ప్రయత్నం చేస్తాం. పోనీ మార్కెట్లో ఉండే పగుళ్లు తగ్గే క్రీం ట్రై చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కొబ్బరి నూనె, పసుపు వంటి ఎన్నో చిట్కాలు వాడి విసిగి వేసారిపోయి ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. 

ఇంతకీ ఆ చిట్కా ఏంటంటే..
బ్రెడ్‌తో కాలా పగుళ్ల సమస్యకు చెక్‌పెట్టొచ్చు. ఏంటీ బ్రెడ్‌! అని ఆశ్చర్యపోవద్దు. ఔను నిజంగానే దాంతో ఈజీగా పగుళ్లు తగ్గిపోతాయట. ముందుగా ఓ బ్రెడ్‌ స్లైడ్‌ తీసుకుని దాన్ని యాపిల్‌ వెనిగర్‌లో ముంచి మీ మడమను కవర్‌ చేసేలా ప్లాస్టిక్‌ కవర్‌తో గట్టిగా చుట్టేయాలి. ఇలా పగుళ్లు ఉన్న చోటల్లా ఇలా యాపిల్‌ వెనిగర్‌లో ముంచిన బ్రెడ్‌ని పెట్టి, ప్లాస్టిక్‌ కవర్‌తో గట్టిగా కట్టేయాలి. ఆ తర్వాత ఫలితం చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశం అంతా గట్టిగా అయ్యి నెమ్మదిగా అక్కడ చర్మం పొలుసులుగా వ్చేసి క్లీన్‌ అయిపోతుంది. ఎలా అంటే పార్లర్‌కి వెళ్లి పెడిక్యూర్‌ చేయించుకున్న మాదిరి ఉంటాయి పాదాలు. తప్పక ట్రై చెయ్యండి. 

(చదవండి: శిల్పంలా ఉండే శృతి హాసన్ బ్యూటీ సీక్రెట్‌ ఇదేనా!)


 

Advertisement
 
Advertisement
 
Advertisement