బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి స్నాక్స్‌ వరకు అన్ని ఈజీగా ఇందులోనే! | Sakshi
Sakshi News home page

బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి స్నాక్స్‌ వరకు అన్ని ఈజీగా ఇందులోనే! నూనె కూడా ఉండదు!

Published Sun, Sep 24 2023 1:27 PM

The Best Kitchen Gadget From Breakfast To Snacks Everything Done  - Sakshi

పూరీలు, పునుగులు వంటి బ్రేక్‌ఫాస్ట్‌ ఐటమ్స్‌తో పాటు.. గవ్వలు, గోరుమిటీలు, మురుకులు వంటి పిండి వంటకాలు.. ఫ్రెంచ్‌ ఫ్రైస్, చికెన్‌ వింగ్స్‌ వంటి వెరైటీలనూ తయారు చేసుకోవాలంటే శ్రమ తప్పదు అనుకుంటున్నారా? అలాంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది ఈ మినీ డీప్‌ ఫ్రైయర్‌. నూనె తక్కువ పీల్చుకుంటూ.. హెల్దీ రుచులను అందిస్తుంది.1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మెషిన్‌ బేస్‌ పాత్రకు లోపల.. ఆయిల్‌ ఇండికేటర్‌ ఉంటుంది. దాని ప్రకారం ఆయిల్‌ పోసుకుని.. నెట్‌ బాస్కెట్‌లో పిండి వంటకాలు, ఫ్రైలు, డీప్‌ ఫ్రైలు చేసుకోవచ్చు.

బాస్కెట్‌కి పొడవైన హ్యాండిల్‌ ఉంటుంది. దాంతో ఈ డివైస్‌ని వినియోగించడం చాలా తేలిక. ఇందులో 140 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 190 డిగ్రీల సెల్సియస్‌ వరకు టెంపరేచర్‌ని సెట్‌ చేసుకోవచ్చు. సుమారు 4 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపు ఇందులో ఎలాంటి ఆహారాన్నైనా సిద్ధం చేసుకోవచ్చు. యాంటీ స్కాల్డింగ్‌ డిజైన్‌తో రూపొందిన ఈ గాడ్జెట్‌ను క్లీన్‌ చేయడం, ఇతర ప్రదేశాలకు మూవ్‌ చేసుకోవడం చాలా సులభం. 

(చదవండి: గుండె పదిలంగా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!)

Advertisement
 
Advertisement
 
Advertisement