
అరుదైన నాణేల సేకర్త
ఈస్ట్ ఇండియా, బ్రిటిష్ నిజాం కాలం నాటి నాణేల సేకరణ
రామగిరి(మంథని): ఆ యువకుడికి చిన్నప్పటి నుంచే నాణేల సేకరణ అంటే ఎంతో మక్కువ. వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తూనే.. సేంద్రియ సాగు పద్ధతులు అవలంబిస్తూనే నాణేల సేకరణను అభిరుచిగా మలచుకున్నారు. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటితరానికి మన ఘనచరితను అందించడమే లక్ష్యంగా ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఆయనే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన యాదగిరి శ్రీనివాస్.
స్వాతంత్య్రం రాకముందు.. వచ్చిన తర్వాత చలామణిలో ఉన్న పలు నాణేలను ఆయన సేకరించి భద్రపరిచారు. ఎవరి వద్ద ఏదైనా పాత నాణేం ఉందని తెలిస్తే చాలు.. వారివద్దకు వెళ్లి మరీ దానిని సేకరించి భద్రపరుస్తున్నారు. ఏడో తరగతి చదువుతున్నప్పుడు.. తండ్రి యాదగిరి రాయమల్లుకు చెందిన గొలిసోడా బండి వద్ద ఉండేవారు. ఈ సందర్భంగా కొనుగోలు దారులు ఇచ్చే నాణేలను చూసిన శ్రీనివాస్.. అప్పుడే వాటి సేకరణపై అభిరుచి పెంచుకున్నారు. అప్పుడు తన నానమ్మ యాదగిరి బొందమ్మ వద్ద గల తూటు (రంధ్రం) నాణెంతో సేకరణ ప్రారంభించారు. అప్పట్నుంచి పలు రకాల నాణేల గురించి తెలుసుకుంటూ వాటి సేకరణను అభిరుచిగా మార్చుకున్నారు.
చదవండి: ఇషా అంబానీ డైమండ్ నెక్లెస్ రూ. 1,267 కోట్లా? నెయిల్ ఆర్ట్ స్పెషల్ ఏంటి?
వ్యవసాయ విస్తరణాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. నాణేల సేకరణ చేస్తున్నారు. ఆయన వద్ద స్వాతంత్య్రం రాకముందు అణా.. అంత కన్నా.. చిన్నవి 22 నాణేలు, స్వాతంత్య్రం వచి్చన తర్వాత వినియోగించిన 1 పైసా–2, 2 పైసలు–3, 3 పైసలు–1, 5 పైసలు–8, 10 పైసలు–16, 20 పైసలు–7, 25 పైసలు–13, 50 పైసలు–19, రూపాయి–38, రూ.2–25, రూ.5–64, రూ.10–30, రూ.20–2 నాణేలు, రూపాయి, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు ఉన్నాయి.
చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
వీటిలో స్వాతంత్య్రం రాకముందు ఈస్ట్ ఇండియా, బ్రిటిష్, నిజాం, గ్వాలియర్ రాజుల కాలం నాటి నాణేలు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రిపబ్లిక్ ఇండియా ముద్రించిన నాణేలున్నాయి. ఆధునిక డిజిటల్ సేవలైన (ఫోన్ పే, గూగుల్ పే) నడుస్తున్నందున.. ఇప్పటి పిల్లలకు వీటిపై అవగాహన కల్పించడం కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఆయా ప్రభుత్వ పాఠశాలలో వీటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసే ఆలోచనలో శ్రీనివాస్ ఉన్నారు. తద్వారా పిల్లలకు అవగాహన కలగడమే కాకుండా.. వారికి ఇది ఒక అభిరుచిగా మారే అవకాశం ఉంటుంది. అప్పటి తరంలో సమాజానికి వ్యవసాయం ప్రాధాన్యాన్ని నాణేల్లో తెలిపారని శ్రీనివాస్ వెల్లడించారు. భవిష్యత్ తరాలకు చరిత్ర గురించి తెలపాలన్న చిరు ప్రయత్నమే.. తన నాణేల సేకరణ అభిరుచికి కారణమని పేర్కొన్నారు.