ఆకాశాన్ని దించుదాం! | Amazing Space Facts for Kids Learn About Space | Sakshi
Sakshi News home page

ఆకాశాన్ని దించుదాం!

May 22 2026 5:51 PM | Updated on May 22 2026 6:19 PM

Amazing Space Facts for Kids Learn About Space

స్పేస్‌కు సంబంధించి పిల్లల క్రియేటివిటీ చూస్తే ఇన్ని అద్భుతాలు  వీరి మైండ్‌లో ఉన్నాయా అని మనకే ఆశ్చర్యమేస్తుంది.

వేసవి రాత్రులు
వేసవి సెలవుల్లో అమ్మమ్మతాతయ్య ఇంటికి వెళ్లినప్పుడు, రాత్రిళ్లు ఆరు బయట పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉండటం.. బోలెడన్ని కబుర్లు చెప్పుకోవడం.. ఇప్పటి పెద్దవారికి కూడా అందమైనæమధుర జ్ఞాపకాలు. నక్షత్రాలు మెరుస్తుండగా ఆకాశాన్ని చూస్తుంటే పిల్లల్లో ఆశ్చర్యాన్ని, సందేహాలను, ఊహాశక్తిని పెంచుతుంది.  ప్రకృతి వేసిన అతి పెద్ద పెయింటింగ్‌ లాంటిది ఆకాశం. సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, వర్షం, ఇంద్రధనస్సు.. ఇవన్నీ ఆకాశంలోనే కనిపిస్తాయి.

‘నక్షత్రం ఎందుకు మెరుస్తోంది?’, ‘చంద్రుడు మనకోసం ఎందుకు వస్తాడు?’, ‘స్పేస్‌లో ఎవరు ఉంటారు?’, ‘పగటి పూట నీలంగా కనిపించే ఆకాశం, రాత్రి అయితే నల్లగా ఎందుకు అవుతుంది? అని అడగవచ్చు... అలాంటి ప్రశ్నలే పిల్లలలో విజ్ఞానానికి తొలి అడుగులు అవుతాయి.

స్పేస్‌ అంటే ...
భూమి బయట ఉన్న అంతులేని విశ్వంలో.. ఏమేం ఉంటాయి? గ్రహాలు,. నక్షత్రాలు, గెలాక్సీలు.. ఎంత చెప్పినా తరగని గని స్పేస్‌ పిల్లల సృజనకు మాటల్లో చెప్పలేనన్ని అద్భుతాలకు కేంద్రం అవుతుంది. రాకెట్ల తయారీ, వాటి ప్రయాణం, భూమి స్పేస్‌లో ఒక చిన్న గ్రహం, చంద్రుడు భూమికి దగ్గరలో ఉన్న సహజ ఉపగ్రహం, సముద్ర అలలపై చంద్రుడి ప్రభావం.. వ్యోమగాములు స్పేస్‌లో ప్రయాణించి చేసే పరిశోధనలు, రాకెట్ల గురించి, ఇప్పటివరకు వెళ్లిన వ్యోమగాముల గురించి, భారతదేశం స్పేస్‌లో సాధించిన గొప్ప విజయాలు.. ఇలా ఎన్నో చెప్పవచ్చు.

ఆసక్తిని పెంచే యాక్టివిటీస్‌...
నక్షత్రాలు లెక్క పెట్టమని చెప్పండి. ఆకారాలు ఊహించమని అడగండి. చందమామ కథలు, నక్షత్రాల కథలు, రాకెట్‌ కథలు చెబితే పిల్లలకు బాగా గుర్తుంటాయి. కాగితంతో రాకెట్‌ తయారు చేయడం. గ్రహాల మోడల్‌ చేయడం. గ్లోబు చూపించడం, స్పేస్‌లో భూమి విలువ, ప్రకృతిని కాపాడుకోవడం, ఎన్నో రహస్యాలకు పెద్ద గని స్పేస్‌. మనిషి బ్రెయిన్‌ కూడా స్పేస్‌. అందులో పుట్టుకువచ్చే అద్భుతాలను తమదైన శైలిలో పిల్లల్ని ఆవిష్కరించమని చెప్పండి. 

పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. సైన్స్‌ మీద ఆసక్తి కలుగుతుంది. ప్రశ్నలు అడిగే అలవాటు పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. ఒక చిన్న నక్షత్రాన్ని చూసి కూడా పిల్లలు పెద్ద కలలు కనగలరు. స్పేస్‌ గురించి తెలుసుకునే విషయాలతో వారి సెలవు రోజులన్నీ పూర్తిగా నిండిపోతాయి.

‘పిల్లల మెదళ్లలో ఎన్నో సృజనాత్మక ఆలోచనలకు ఆకాశమే హద్దు అవుతుంది. రాత్రిపూట చుక్కల ఆకాశం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చంద్రుడు, సూర్యుడు ఆకాశంలో ఎలా ఉంటారు? విశ్వం అద్భుతం గురించి తెలియజెబితే.. పిల్లలు ఎంత ఆసక్తిగా వింటారో చాలా క్లాసుల్లో నేను గమనించాను’ అంటారు నటి, ఆర్ట్‌ టీచర్‌ గీతా భాస్కర్‌ (Dhaassyam Geetha Bhascker).

చ‌ద‌వండి: అన్నీ ఇచ్చే నేలమ్మకు ఏమిద్దాం? 

‘ఫైవ్‌ ఎలిమెంట్స్‌’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన..ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్‌ ఐడి sakshisummerkids@gmail.com

నిర్వహణ: నిర్మలారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement