
మలైకా ఆరోగ్య రహస్యం
ఐదు పదులు దాటుతున్నా ఇంకా ఫిట్‌గా... ఆరోగ్యంగా కనిపించే మలైకా అరోరా అందానికి పడి΄ోని వారుండరంటే అతిశయోక్తి కాదు. చాలామందికి ఆమె ఆరోగ్య రహస్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తి. అదే ప్రశ్న అడిగితే కొంటెగా నవ్వేసి ‘వెరీ సింపుల్... నేను నా దినచర్యను రెటినోల్ జ్యూస్‌తో ప్రారంభిస్తాను. అందుకే ఈ అందం’’ అని చెప్పింది. మెరుపులీనే పట్టులాంటి చర్మం, ఎప్పుడు చూసినా ఫ్రెష్‌గా కనిపించే చర్మసౌందర్యం కావాలంటే ముందుగా మెరుగైన జీర్ణక్రియ అవసరం. మంచి ఆరోగ్యం కోసం మలైకా లా మనం కూడా మన దినచర్యను రెటినోల్ జ్యూస్‌తో ప్రారంభిస్తే సరి.
అదెలాగో చూద్దామా..
రెటినోల్ జ్యూస్ అంటే ఏమిటి? ఇది రోజువారీ పండ్లు, కూరగాయల సహజ ప్రయోజనాలతో నిండిన పానీయం. దీనిని తాజా కూరగాయలు, పండ్లతో తయారు చేసుకోవచ్చు.
రెటినోల్ జ్యూస్ కోసం ..
2 క్యారెట్లు, సగం దోసకాయ, ఒక నారింజ, సగం నిమ్మకాయ, అల్లం ముక్క.. పై పదార్థాలను కడిగి, తొక్క తీసి, వాటిని కలిపి జ్యూస్ చేసుకుని ఒక గ్లాసులో పోసుకుని వెంటనే తాగేయాలి. ఈ జ్యూస్‌లో సమృద్ధిగా ఉండే విటమిన్ సి ఇతర విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోజంతా తాజాగా ఉండేందుకు తోడ్పడతాయి.