నా వేలితో నా కంటినే పొడుచుకున్నా.. | - | Sakshi
Sakshi News home page

నా వేలితో నా కంటినే పొడుచుకున్నా..

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

నా వేలితో నా కంటినే పొడుచుకున్నా..

కై కలూరు మాజీ సర్పంచ్‌ నవరత్నకుమారి

కై కలూరు: కూటమి పార్టీలో చేరి నా వేలితో నా కంటిని నేనే పొడుచుకున్నానని కై కలూరు మాజీ సర్పంచ్‌ దానం మేరీ నవరత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ కాలం చివరి రోజు గురువారం ఆమె కై కలూరులో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌), పార్టీ నాయకుల మద్దతుతో సర్పంచ్‌గా విజయం సాధించానన్నారు. కూటమిలో చేరిన అనంతరం ఎస్సీ సర్పంచ్‌గా విధులు నిర్వహిసున్న తనపై అసత్య ఆరోపణలు చేసి చెక్‌పవర్‌ రద్దుతో పాటు సర్పంచ్‌గా సస్పెండ్‌ చేశారన్నారు. కోర్టు ఆదేశాలతో తిరిగి ఇటీవల సర్పంచ్‌గా విధుల్లో చేరానన్నారు. కై కలూరులో సంపు తొగింపు, వెలంపేట స్కూల్‌ వద్ద ట్రాన్మ్‌ఫార్మర్‌ ఏర్పాటు, వార్లకోడు డ్రెయిన్‌, దళిత క్రైస్తవుల శ్మశాన వాటిక విషయంలో కచ్చితత్వంగా ఉండటం వల్ల నాపై కక్ష సాధింపు చర్యలకు నాయకులు దిగారన్నారు. న్యాయ స్థానంపై నమ్మకం ఉందని, అందరికీ కోర్టు ద్వారా సమాధానం చెబుతానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement