ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయ హుండీల నగదు, కానుకల లెక్కింపు వేళ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేశారు. 8లో u
ఏలూరు కలెక్టరేట్‌లో ప్రజా పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి మొరపెట్టుకుంటున్నా సమస్య పరిష్కారం మాత్రం అంగుళం కూడా కదలడం లేదు. కొత్త పింఛన్ కోసం రెండేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా స్పందించే వారు లేరు. భూ తగాదాలు, ఆస్తి తగాదాలు, వేధింపులు ఇలా చెప్పుకుంటూ ఎన్నో సమస్యలతో వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చినా పరిష్కారం మాత్రం కనుచూపు మేరలో లేదని ఫిర్యాదు చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి ఫిర్యాదు చేయడం తప్ప సమస్య సమస్యగానే మిగిలిపోతోందని వాపోతున్నారు.


