కై కలూరు: ఆటో ఢీకొని ఓ మోటార్‌సైక్లిస్టు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉండి మండలం, పెద్దపేటకు చెందిన బేతపూడి రవి(30)కు వివాహం కాగా ఇరువురు సంతానం. భార్యతో విభేదాల కారణంగా మరొకరితో సహజీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో తండ్రి, బావ వద్ద తాళాల తయారీ పని చేస్తున్నాడు. సొంతూరు వెళ్లడానికి హైదరాబాదు నుంచి మోటార్‌సైకిల్‌పై ఆదివారం ఉదయం బయలు దేరాడు. సోమవారం ఉదయం ఆటపాక గ్రామం వచ్చేసరికి జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సును ఓవర్‌టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో వెనుకభాగాన్ని ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. టౌన్ ఎస్సై డి.వెంకట్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


