తాడేపల్లిగూడెం : నిట్‌కు చెందిన ఇద్దరు ఆచార్యులకు నూతనంగా జాతీయ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యులు డాక్టర్ కుల్డీప్ రాయ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యులు కె.షాలంలకు జాతీయ ప్రాజెక్టులు మంజూరయ్యాయనిశుక్రవారం నిట్ నుంచి విడుదలైన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ కుల్డీప్ రాయ్ ఎండోక్రైన్‌కు భంగం కలిగించే ఫ్తాలేట్స్‌ను క్షీణింపజేయడానికి హైడ్రోడైనమిక్ క్యావిటేషన్ ద్వారా పర్సల్ఫేట్ సక్రియతపై యాంత్రిక అవగాహన అనే ప్రాజెక్ట్‌కు రూ 68 లక్షల నిధులను దక్కించుకున్నారు. కె.షాలం గ్రామీణ మల్టీ లేన్ రోడ్లలో డిజైన్ స్థిరత్వం కోసం నిరంతర ప్రయాణం డేటాతో స్థిరత్వం కోసం నిరంతర ప్రయాణం డేటాతో ఆపరేటింగ్ స్పీడ్ మోడల్స్ అభివృద్ధి అనే ప్రాజెక్ట్‌కు రూ.24 లక్షల నిధులను దక్కించుకున్నారు. ఆచార్యులు ఇద్దరూ మూడేల్ల కాల పరిమితిలో ఈ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాల్సిన ఉంటుంది. జాతీయ ప్రాజెక్ట్‌లను దక్కించుకున్న ఆచార్యులను ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎస్‌వీ రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి తదితరులు అభినందించారు.


