ఇన్‌స్టా పరిచయం.. కడకు విషాదాంతం | - | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టా పరిచయం.. కడకు విషాదాంతం

Mar 27 2026 8:54 AM | Updated on Mar 27 2026 8:54 AM

ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా వివాహితతో యువకుడి పరిచయం

ఆ పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లిచేసుకున్న వైనం

పెద్దలు ఒప్పుకోరని కాలువలో దూకి ఆత్మహత్య

ఉంగుటూరు: సోషల్‌ మీడియా ద్వారా ఓ వివాహితకు, యువకుడికి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. చివరికి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఉంగుటూరు మండలం యర్రమళ్ల గ్రామానికి చెందిన గుండుగొల్లు మావుళ్లు (25) చేపల ప్యాకింగ్‌కు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎర్రి రమ (35) అనే వివాహితతో మావుళ్లుకు ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే అప్పటికే ఆమెకు వివాహం కాగా ఇటీవల మావుళ్లు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రమ తరుఫు బందువులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. అప్పటి నుంచి మావుళ్లు తాడేపల్లిగూడెం మండల కడియద్దలోని తన చెల్లెలు ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తిరిగి రెండు రోజుల క్రితం రమ శ్రీకాకుళం నుంచి మావుళ్లు దగ్గరకు వచ్చేసింది. ఈ సమాజం వారిని బతకనీయదు అనుకున్నారో ఏమో ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి నాచుగుంట రేవు వద్దకు చేరారు. మావుళ్లు తన తమ్ముడు కి ఫోను చేసి విషయం చెప్పి నాచుగుంట వంతెన మీదనుంచి ఇద్దరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మావుళ్లు తమ్ముడు వచ్చేసరికి వంతెన వద్ద సెల్‌ఫోను, ఇతర సామాన్లు కనిపించడంతో పోలీస్‌, ఫైర్‌ అధికారులకు సమాచారం అందించారు. భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్‌ సిబ్బంది, చేబ్రోలు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ఎస్సై సూర్యభగవాన్‌, తహసీల్దార్‌ పూర్ణచంద్రప్రసాద్‌, ఇతర అధికారులు గాలింపు చర్యలను ఎప్పుటికప్పుడు పర్యవేక్షించారు. బుధవారం రాత్రి 10,30 గంటలకు మావుళ్ల మృతదేహం ఉంగుటూరు టోలు ప్లాజా సమీపంలో లభ్యమైంది. అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక ఎస్‌టీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలించగా రమ మృతదేహం చేబ్రోలు పోలీస్టేషన్‌ సమీపంలో గోదావరి కాలువలో గురువారం మధ్యాహ్నం 2 30 గంటలకు లభ్యమైంది. ఎస్సై సూర్యభగవాన్‌ ఆధ్వర్యంలో మావుళ్లు మృతదేహనికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గుండుగొల్లు మావుళ్లు మృతదేహం,

చేబ్రోలు వద్ద లభ్యమైన ఎర్రి రమ మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement