కలిదిండి (కై కలూరు): చెరువు తవ్వుకోవడానికి కొందరు వ్యక్తులు పెడుతున్న ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కలిదిండి మండలం కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి వెంకట నరసయ్య, పద్మావతి దంపతులు చెరువు తవ్వుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే వారు కొందరికి అప్పుగా కొంత నగదు చెల్లించాల్సి ఉండడంతో వారు చెరువు తవ్వకుండా పొక్లెయిన్‌ను అడ్డుకున్నారు. దీంతో మనస్థాపం చెందిన దంపతులు పురుగుమందు తాగారు. వీరిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న దంపతులను వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. దంపతుల ఆత్మహత్య విషయమై కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావును వివరణ కోరగా తమకు సమాచారం రాలేదని చెప్పారు.
వ్యాన్ ఢీకొని మోటార్‌సైక్లిస్టుకు గాయాలు
భీమవరం అర్బన్: వ్యాన్ ఢీకొని మోటార్‌సైక్లిస్టుకు గాయాలయ్యాయి. నాగిడిపాలెంకు చెందిన బర్రె ఏసు తెల్లవారుజామున తన ద్విచక్ర వాహనంపై చేపల పట్టుబడికి వెళ్తుండగా నాగిడిపాలెం వంతెన వద్ద వ్యాన్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. అతడిని స్థానికులు భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఏసు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఐ వీర్రాజు కేసు నమోదు చేశారు.
ఆస్పత్రిలో పరామర్శించిన డీఎన్నార్


