20 లక్షల ఉద్యోగాలన్నారు.. ఎన్నిచ్చారు?
ఏలూరు టౌన్: జగనన్న 2.0లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారని, ప్రతి సంక్షేమ పథకం కార్యకర్తల ద్వారానే ప్ర జలకు చేరతాయని వైఎస్సార్‌సీపీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీ ఎన్నార్) అధ్యక్షతన ఏలూరు జిల్లా పార్టీ ఆత్మీయ సమావేశం సోమవారం నగరంలో నిర్వహించారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలకు మంచిరోజు లు రానున్నాయనీ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపే తం చేస్తూ జగన్‌ని ముఖ్యమంత్రిని చేసేందుకు సై నికుల్లా పనిచేయాలని డీఎన్నార్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా
మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో మొదటి పార్టీ జెండా ఏలూరు జిల్లాలోనే ఎగరాలనీ, ఈ జిల్లానే గెలుపునకు నాంది పలకాలని పి లుపునిచ్చారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతాలని, ఇ క్కడ ఏ పార్టీ మెజార్టీ సాధిస్తే అధికారం అదే పార్టీ కై వసం చేసుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నా రు. పేదవాడికి మేలు జరగాలంటే జగన్ ముఖ్యమ ంత్రి కావాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, ల్యాండ్ మా ఫియా రాజ్యమేలుతున్నాయని, ఏలూరు ఎంపీ డ్ర గ్స్‌తో పట్టుబడి, కై కలూరులో జనసేన పార్టీ నేతలు పసిపిల్లలను విక్రయించటం విస్మయానికి గురిచేసిందన్నారు. పోలీసులు ధ్రువీకరించినా అతడికి స్టే షన్ బెయిల్ ఇవ్వటం కూటమి పాలనకు నిద ర్శనం అన్నారు. డ్రగ్స్ వినియోగం, పిల్లలను విక్రయిస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారనీ, వైఎస్సార్‌సీపీ నే తలు, కార్యకర్తలను మాత్రం అక్రమ కేసుల్లో జైలు కు పంపుతారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం 22 నెలల్లోనే రూ.3.50 లక్షల కోట్లు అప్పులు చేసిందనీ, అన్నీ రంగాలు తీవ్ర కష్టాల్లో ఉన్నాయని తెలిపారు. పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజలకు అండగా నిలవాలన్నారు.
కేసులకు భయపడం
ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్రమ కేసులకు, దాడులకు, దౌర్జన్యాలకు భయపడేది లేదనీ స్పష్టం చేశారు. తన తండ్రి అధికారంలో ఉండగా తాను ఏనాడు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదనీ, కేసులు పెడితే భయపడతానని అనుకోవద్దని అన్నారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేర కు ఏ పని అప్పగించినా చేస్తానని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం దృష్టికి సమస్యలు
ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా అంటే ఎదురులేని జిల్లా అనీ...కూటమి ప్రభుత్వం భయపెట్టాలని చూసినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భయపడే రకం కాదన్నారు. తాను శాసనమండలిలో మన్యం, జిల్లాలోని ప్రజల సమస్యలపై మాట్లాడుతూ ప్రభు త్వం దృష్టికి తీసుకువెళుతున్నానని చెప్పారు. గ్రామస్థాయిలో ప్రజాసమస్యలపై దృష్టి పెడుతూ వాటిపై పోరాటం చేయాలని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమంలో విఫలం
ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌ని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతిఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో దారుణంగా విఫలమైందన్నారు. ప్రజలు ఎవరూ సంతోషంగా లేరన్నారు.
సూపర్–6తో మోసం
పోలవరం మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త తెల్లం బాలరాజు మాట్లాడుతూ టీడీపీ సూపర్–6 పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను అత్యంత దారుణంగా వేధిస్తున్నారనీ, అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలతో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. కూటమి పాలనను కూకటి వేళ్లతో పెకిలించేలా పనిచేయాలన్నారు.
వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త కొఠా రు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ 2029లో కై వసం చేసుకోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించి నా, ఆస్తులు లాక్కున్నా పార్టీ జెండాను భుజాన వేసుకునే తిరుగుతామని స్పష్టం చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్
చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయన్నారు. శ్రీవారి లడ్డూ ప్ర సాదం లేదంటే షర్మిలను రంగంలోకి దించి ఆస్తులపై విమర్శలు చేయించటంతో ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
ప్రభుత్వం ఘోరంగా విఫలం
ఏలూరు సమన్వయర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీల అమలులో ఘోరంగా విఫలమైందని, సూపర్ సిక్స్‌తోపాటు మరో 143 హామీలకు హ్యాండిచ్చారన్నారు. ప్రజలకు టీడీపీ చేసిందేమీ లేదని, సామాన్య, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయన్నారు. నాణ్యమైన వైద్యం అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, ఏలూరు పరిశీలకుడు డీవీఆర్‌కే చౌదరి, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, రాష్ట్ర కార్యదర్శి వెజ్జు వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడు గోరుముచ్చు గోపాల్ యాదవ్, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముంగర సంజయ్, ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్, జిల్లాలోని వైఎస్సార్‌సీపీ కీలక నేతలు, పార్టీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్
కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రగల్భాలు పలికారని, అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్ ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల గొంతు కోశారన్నారు. చంద్రబాబు ప్రభత్వుం 2024లో, 2025లో జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదన్నారు. ఉద్యోగాలు కల్పించలేదు, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా యువతను మోసం చేవారన్నారు. టీడీపీ నేతలు పబ్లిసిటీ మాయతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఎంపీ వల్ల ఏలూరు పరువు పోయింది
ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని, ఆయనకు సీబీఐ, లేదా పోలీస్ ఎంకై ్వరీలో క్లీన్ చిట్ ఇచ్చారా అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఏలూరు జిల్లా పరువుపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణలో టీడీపీ పార్ట్‌నర్ ప్రభుత్వమే ఉందని, మేనేజ్ చేసుకునే స్థాయి దాటిపోయి మరీ ఎంపీ పుట్టా డ్రగ్స్ తీసుకున్నారని విమర్శించారు. ఇంత జరిగినా.. ఏలూరు జిల్లాలో ఫ్లెక్సీలు వేసుకుంటూ సమర్థించుకోవటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తాను మన్యం జిల్లా, అల్లూరి జిల్లా ఇన్‌చార్జిగా వేల కిలోల గంజాయిని ధ్వంసం చేశామని, కేసులు నమోదు చేశామని గుర్తుచేశారు. అయినా టీడీపీ బురద జల్లిందని మండిపడ్డారు.
2029లో ఏలూరు జిల్లా నుంచే గెలుపునకు నాంది
రాష్ట్రంలో రాజ్యమేలుతున్న డ్రగ్స్, ల్యాండ్ మాఫియాలు
కూటమి నేతలకు స్టేషన్ బెయిల్... మనపైన అక్రమ కేసులు
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్
ఏలూరు ఆత్మీయ సమావేశంలో దిశానిర్దేశం


