ఏలూరు (టూటౌన్) : సామ్రాజ్యవాద వ్యతిరేక దినం సందర్భంగా పీడీఎస్‌ఓ–ఎన్‌వైఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం అమెరికా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని అందరూ వ్యతిరేకించాలని నినదించారు. అనంతరం అ ల్లూరు సత్యనారాయణ భవనంలో పీడీఎస్‌ఓ రా ష్ట్ర కోశాధికారి ఎల్.భాను అధ్యక్షతన సభ ని ర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాల మాజీ సూపరింటెండెంట్ గోపాలకృష్ణయ్య వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీడీఎస్‌ఓ ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. తక్షణమే పీపీపీ విధానాన్ని రద్దుచేసి వైద్య విద్యను, వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ భగత్‌సింగ్ పోరాటాన్ని గుర్తుచేశారు. న్యాయ వాది పీపీ శాస్త్రి, సామాజికవేత్త తలారి మోహన్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో ఆదివారం రాత్రి సినీ దర్శకుడు సతీష్ అడ్డాల దర్శకత్వంలో నిర్వహించిన క్రౌన్ ఆఫ్ ఏలూరు అందాల పోటీల్లో నగరానికి చెందిన దివ్య ఆలపాటి మిస్ ఏలూరు కిరీటాన్ని దక్కించుకున్నారు. దర్శకుడు సతీష్ అడ్డాల, కో డైరెక్టర్ ప్రియా ఎండానా, సినీ ప్రముఖులు ఆమెకు ట్రోఫీని అందించి కిరీటాన్ని అలంకరించారు. ర్యాంప్ వాక్, ఐక్యూ రౌండ్లలో తనదైన శైలిలో దివ్య రాణించి విజేతగా నిలిచింది. అలాగే మిసెస్ ఏలూరు, మిస్టర్ ఏలూరు, కిడ్స్ విభాగాల్లో కూడా పో టీలు నిర్వహించారు. మిస్ ఏలూరుగా ఎంపిక కావడం ఆనందంగా ఉందని దివ్య అన్నారు. ప్రముఖులు, ఫ్యాషన్ రంగ నిపుణులు, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా వి ధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షకు సోమవారం 560 మంది హాజరయ్యారు. 665 మందికి గాను 105 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను జిల్లాస్థాయి పరిశీలకులు, జిల్లా విద్యాశాఖాధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్, డీఈసీ కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.


