భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు రోజుల పాటు జరిగిన అండర్–23 మెన్ అండ్ ఉమెన్ ఓపెన్ బాక్సింగ్ జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో.. ఉమెన్ విభాగంలో ఢిల్లీ టీం ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచి సాగి రామకృష్ణంరాజు ట్రోఫీ 2026ను గెలుచుకుంది. ద్వితీయ స్థానాన్ని పంజాబ్ టీం గెలుచుకున్నట్లు ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రాకేష్ మిశ్రా, ఏపీ స్టేట్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. ఢిల్లీ టీంలో చంచల్ కుమారి, నాన్సీ, ఆర్జు, పూజ, శివాని, జార్జ్ తోమర్, సంజనా దేవి, స్మృతి, ఖుషీ ఉన్నారు. రన్నర్స్‌గా నిలిచిన పంజాబ్ టీంలో పరదీప్ కౌర్, హర్షదీప్ కౌర్, అలీషా, ప్రీతి, ఉమాంగ్ బజాజ్ ఉన్నారు. ఈ సందర్భంగా బాక్సింగ్ జాతీయ అధ్యక్షుడు రాకేష్ మిశ్రా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయస్థాయి ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను అద్భుతంగా నిర్వహించినందుకు అభినందించారు.


