కట్టెల పొయ్యిలే దిక్కు | - | Sakshi
Sakshi News home page

కట్టెల పొయ్యిలే దిక్కు

Mar 21 2026 5:02 AM | Updated on Mar 21 2026 5:02 AM

కట్టెల పొయ్యిలే దిక్కు లక్ష్యాలను పూర్తి చేయాలి గోవును పూజిస్తే శుభాలు ఎక్స్‌టర్నల్‌ డివైజ్‌ ద్వారా నకిలీ టికెట్లు రైతులకు అండగా ఉంటాం

ఏలూరు (టూటౌన్‌): యుద్ధం పేరుతో ప్రజలపై భారాలు మోపుతూ గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్యాస్‌ను అందుబాటులో లేకుండా చేయడంపై సీఐటీయూ అనుబంధ ఏపీ మున్సి పల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు మండిపడ్డారు. శుక్రవారం స్థానిక వంగాయగూడెం సెంటర్‌లో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ ఖాళీ సిలిండర్లతో వినూత్నంగా ధర్నా నిర్వహించారు. సంఘ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంగులూరి జాన్‌బాబు, మంచెల్ల ఇస్సాకు మాట్లాడుతూ యుద్ధం పేరుతో గ్యాస్‌ సిలిండర్లు బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, పనికి వెళ్లే పేదలకు సకాలంలో ఆహారాన్ని వండి అందించలేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరను తగ్గించాలని, సిలిండర్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను 25వ తేదీలోపు నూరుశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదే శించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు లక్ష్యాలను పూర్తిచేయడంపై శ్రద్ధ చూపాలన్నారు. డ్వాక్రా సంఘాల రుణ లక్ష్యాలు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు, పంచాయతీ రాజ్‌, హౌసింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, సమగ్ర శిక్ష, రోడ్లు, భవనాల శాఖ అధికారులు చేపట్టిన పనులు పూర్తిచేసి బిల్లులు అప్‌లోడ్‌ చేయాలన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఏలూరు కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ త్రినాథ్‌బాబు, ఆర్‌అండ్‌బీ ఈఈ వైవీ కిషోర్‌ బాబూజీ, డీఎంహెచ్‌ఓ శోభ తదితరులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: గోవును పూజించినా.. గోవుకు సేవించినా.. సకల శుభాలు కలుగుతాయని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి ఉద్బోధించారు. ఒంగోలు, పుంగనూరు గోజాతి సంక్షేమ సంఘం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ–రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, దాతల సౌజన్యంతో ద్వారకాతిరుమల మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన గోవుల అందాలు, పాల పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. గో పోషకులతో మాట్లాడి, గో విశిష్టత ను తెలియజేశారు. అనంతరం అనుగ్రహ భా షణం చేశారు. గోవులో ముక్కోటి దేవతలు ఇమిడి ఉంటారని, ప్రతిఒక్కరూ గోవులను ఆ రాధించాలన్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న గో అందాలు, పాల పోటీలు ఉన్నతమైనవన్నారు. సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవడంలో గోసంరక్షణ ముఖ్యమైందన్నారు. గోశాలలను ప్రోత్సహించడం ద్వారా జీవన విధానంలో మార్పు, దైవత్వాన్ని ఆస్వాదించవచ్చన్నారు. ఇదిలా ఉంటే ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఇప్పటివరకు 91 పుంగనూరు, ఒంగోలు ఆవులు, గిత్తలు పాల్గొన్నాయి.

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో రూ.200 నకిలీ టికెట్ల విక్రయాల వ్యవహారానికి సంబంధించిన కంప్యూటర్లను, టికెట్లను, సీసీ ఫుటేజీలను సాంకేతిక నిపుణుల బృందం శుక్రవారం ప్రాఽథమికంగా పరిశీలించింది. నిందితులు ఎక్స్‌టర్నల్‌ డివైజ్‌ను ఉపయో గించి, జావా స్క్రిప్ట్‌ ద్వారా రూ.200 టికెట్లను ప్రింట్‌ చేసినట్టు నిర్ధారించారు. నేషనల్‌ ఇన్ఫర్‌మేటిక్స్‌ సెంటర్‌ నిపుణుల ద్వారా తనిఖీలు చేయించి, పూర్తిస్థాయిలో వివరాలను రాబట్టాల్సి ఉందని ఈఈ డీవీ భాస్కర్‌ తెలిపారు.

తాడేపల్లిగూడెం: అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటల రైతులకు అండగా ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు ఉంటారని ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్‌ కె.ధనుంజయరావు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement