సొంత మండలాల్లో బదిలీలకు వినతి | - | Sakshi
Sakshi News home page

సొంత మండలాల్లో బదిలీలకు వినతి

Mar 1 2026 7:54 AM | Updated on Mar 1 2026 7:54 AM

సొంత

సొంత మండలాల్లో బదిలీలకు వినతి

సొంత మండలాల్లో బదిలీలకు వినతి ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు జీతాల కోసం ఎంపీటీసీ ఆందోళన నేరాల నియంత్రణకు చర్యలు లైంగిక వేధింపులను ఉపేక్షించం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉపాధ్యాయులకు వచ్చే మే నెలలో చేపట్టే బదిలీల్లో వారి సొంత మండలాలకు ప్రాధాన్యమివ్వాలని ఏపీటీఎఫ్‌–1938 జిల్లా అధ్యక్షుడు ఈ.రామ్మోహన్‌, ప్రధాన కార్యదర్శి జి. మోహన్‌, కార్యదర్శి జి.శ్రీనివాసరావు డీఈఓను కోరారు. శనివారం డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు గతంలో ప్రభుత్వ ఆదేశా ల మేరకు పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారని, 2025 బదిలీల్లో వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రత్యేకించి 1998 డీఎస్సీ ఉపాధ్యాయులు రిటైర్మెంట్‌ వయసుకు దగ్గరలో ఉన్న నేపథ్యంలో దూర ప్రాంతాల్లో విధులు కష్టసాధ్యమవుతుందన్నారు. దీంతో రాబోయే బదిలీల్లో ఎంటీఎస్‌ ఉపాధ్యాయులను సొంత మండలాల్లో బదిలీలు చేయాలని కోరారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 55 కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియెట్‌ సె కండియర్‌ బోటనీ/హిస్టరీ పరీక్షలకు 5,791 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్‌ విద్యార్థులు 4025 మందికి 3,916 మంది, 2,003 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 1,875 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్‌ తెలిపారు.

ఉంగుటూరు: తమకు 29 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉంగుటూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శనివారం నిరసన తెలిపారు. ఎంపీటీసీలకు నెలకు రూ.3 వేలు, జెడ్పీటీసీ కొరిపల్లి జయలక్ష్మికి నెలకు రూ.6 వేలు, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మికి నెలకు 6 వేల చొప్పున జీతాలు రావాల్సి ఉందన్నారు.

ఏలూరు టౌన్‌: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ, నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ కేపీ శివకిషోర్‌ ఆదేశించారు. నగరంలోని జిల్లా పోలీస్‌ ప్రధా న కార్యాలయంలో శనివారం నేర సమీక్షా స మావేశాన్ని నిర్వహించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని స్టేషన్లలో కేసు నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్ట్‌, కోర్టుల్లో చార్జిషీట్‌ దాఖలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలన్నారు. నేరస్తులకు వేగంగా శిక్షలు పడితేనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. నేర దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాల సేకరణకు ప్రాధాన్యమవ్వాలని, కో ర్టుల్లో సాక్షాధారాలు పటిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, మహిళా స్టేషన్‌ డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): మహిళలను పనిచేస్తున్న ప్రదేశాల్లో, విద్యాసంస్థల్లో లైంగికంగా వే ధిస్తే చర్యలు తప్పవని భీమవరం 2వ అదనపు జుడీషియల్‌ మొదటి తరగతి లైంగిక వేధింపుల నిరోధక చట్టం, మహిళల భద్రత, బాల్య వివాహ నిషేధ చట్టం తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ మహిళలు, అమ్మాయిలు వేధింపుల బారిన పడితే తల్లిదండ్రులు, అధ్యాపకుల దృష్టికి తీసుకురావాలన్నా రు. శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని సూ చించారు. మైనర్లపై లైంగికదాడులు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

సొంత మండలాల్లో బదిలీలకు వినతి 1
1/2

సొంత మండలాల్లో బదిలీలకు వినతి

సొంత మండలాల్లో బదిలీలకు వినతి 2
2/2

సొంత మండలాల్లో బదిలీలకు వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement