హనుమద్‌ హోమం | - | Sakshi
Sakshi News home page

హనుమద్‌ హోమం

Dec 22 2025 2:14 AM | Updated on Dec 22 2025 2:14 AM

హనుమద

హనుమద్‌ హోమం

హనుమద్‌ హోమం మంగమ్మ తల్లికి పూజలు నేటి నుంచి సేవా శిబిరాలు బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌గా నూజివీడు సిద్ధార్ధ డిగ్రీ కళాశాల జట్టు

జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో ఆదివారం హనుమద్‌ హోమం నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో ఆర్‌వీ చందన మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఆర్జీత సేవగా హనుమద్‌ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు.

బుట్టాయగూడెం: కోర్కెలు తీర్చే తల్లిగా, గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. చలికాలం, మంచు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మంగమ్మ తల్లి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

పెద్దింట్లమ్మకు పూజలు

కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీప జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజు వివిధ రూపాల్లో రూ.41,115 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు తెలిపారు.

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ 2, 4, 8, 9ల ఆధ్వర్యంలో మండలంలోని సుంకొల్లు, గొడుగువారిగూడెం, యానాదికాలనీ, యనమదల గ్రామాల్లో ఈనెల 22 నుంచి సేవా శిబిరాలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల సమస్యలను వాలంటీర్లు నమోదు చేస్తారన్నారు. ఈ శిబిరాలు ఏడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు వివరించారు.

నూజివీడు: కృష్ణా యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల బాస్కెట్‌బాల్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రెండురోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో భాగంగా ఫైనల్‌ మ్యాచ్‌లో నూజివీడు సిద్ధార్ధ జట్టు విజయవాడ కేబీఎన్‌ జట్టుపై 56–28 స్కోర్‌ తేడాతో విజయం సాధించి యూనివర్సిటీ చాంపియన్‌గా నిలిచింది. దీంతో వరుసగా రెండోసారి విజేతగా నిలిచినట్లయింది. రెండో స్థానంలో కేబీఎన్‌ కళాశాల జట్టు, మూడో స్థానంలో విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల జట్టు, నాలుగో స్థానంలో విజయవాడ పీబీ సిద్ధార్ధ కళాశాల జట్టు నిలిచాయి. విజేతగా నిలిచిన సిద్ధార్ధ కళాశాల జట్టు క్రీడాకారులను ఫిజికల్‌ డైరెక్టర్‌లు సత్యన్నారాయణ, అంజాద్‌ఆలీ, ట్రిపుల్‌ ఐటీ పీడీ సూర్య, సిద్ధార్ధ కళాశాల కరస్పాండెంట్‌ గొల్లపూడి రవిబాబు, డైరెక్టర్లు తోటకూర సాంబశివరావు, మోరంపూడి సత్యన్నారాయణ తదితరులు అభినందించారు.

హనుమద్‌ హోమం 
1
1/2

హనుమద్‌ హోమం

హనుమద్‌ హోమం 
2
2/2

హనుమద్‌ హోమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement