జనాభిమానం ఉప్పొంగే | - | Sakshi
Sakshi News home page

జనాభిమానం ఉప్పొంగే

Dec 22 2025 2:21 AM | Updated on Dec 22 2025 2:21 AM

జనాభి

జనాభిమానం ఉప్పొంగే

ఏలూరు నియోజకవర్గంలో..

ద్వారకాతిరుమల మండలంలో..

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనాభిమానం ఉప్పొంగింది. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా సంబరంలా నిర్వహించారు. 7 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తల నేతృత్వంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, రోగులకు పండ్ల పంపిణీ ఇలా అనేక సేవా కార్యక్రమాలతో జననేతపై అభిమానం పంచుకున్నారు. కై కలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం సింగారం గ్రామంలో దివంగత వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొని రక్తదానం చేశారు.

కై కలూరు నియోజకవర్గంలో..

కై కలూరు నియోజవకర్గంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముదినేపల్లి మండలం సింగారంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాలుగు మండలాల్లోని వివిధ గ్రామాల్లో వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు విష్ణువర్ధన్‌ రాజు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

నూజివీడు నియోజకవర్గంలో..

నూజివీడు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. దీనిలో భాగంగా చినగాంధీ బొమ్మ సెంటర్‌లో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ అందచేశారు. నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల్లో గ్రామ గ్రామాన వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొమ్ము వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

ఉంగుటూరు నియోజకవర్గంలో..

ఉంగుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బువ్వనపల్లి పార్టీ కార్యాలయం, పెదనిండ్రకొలను ఆరోగ్య కేంద్రం, తోకలపల్లి, మళ్లపరాజు పేట, మొయ్యేరు, రాచూరు, నల్లమాడు, గొల్లగూడెం గ్రామాల్లో జన్మదిన వేడుకల్లో వాసుబాబు పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. రోగులకు పండ్లు, రొట్టెలు, దుప్పట్లు పంపిణీ చేశారు. నిడమర్రు మండలం పత్తేపురంలో పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నౌడు వెంకటరమణ నేతృత్వంలో కేక్‌ కట్‌ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

దెందులూరు నియోజకవర్గంలో..

దెందులూరు నియోజకవర్గంలో ఇన్‌చార్జి కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దెందులూరు మండలం దోసపాడులో పార్లమెంట్‌ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌ కుమార్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. విజయరాయిలో అబ్బయ్యచౌదరి పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. జెడ్పీటీసీ లీలా నవకాంత్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పి.విజయ్‌బాబు, పార్టీ జెడ్పీటీసీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

పోలవరం నియోజకవర్గంలో..

పోలవరం నియోజకవర్గంలో ఇన్‌చార్జి తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడకలు ఘనంగా నిర్వహించారు. బుట్టాయగూడెంలో జరిగిన కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కుక్కునూరులో జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. పోలవరంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. నాయకులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్‌ బాబ్జి, జగ్గురోతి మోహనరావు తదిరులు పాల్గొన్నారు.

చింతలపూడి నియోజకవర్గంలో..

చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చింతలపూడిలో మెగా రక్తదాన శిబిరం, పేదలకు అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంచిపెట్టారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కారుమూరి సునీల్‌ కుమార్‌ యాదవ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పాల్గొన్నారు.

ఏలూరు నియోజకవర్గంలో పార్లమెంట్‌ ఇన్‌చార్జి, యువజన విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కారుమూరి సునీల్‌కుమార్‌, నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రక్తదానం, అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. సత్రంపాడు అంబేద్కర్‌ నగర్‌లో రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌ బాబు ఆధ్వర్యంలో కేక్‌ కటింగ్‌ నిర్వహించారు.

ద్వారకాతిరుమల మండలంలోని జాజులకుంట, తూర్ల లక్ష్మీపురం, ఐఎస్‌ రాఘవాపురం, రామానుజాపురం, ఐఎస్‌ జగన్నాథపురంలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. జాజులకుంటలో పార్టీ నాయకుడు ముమ్మడి సత్యనారాయణ (సింగ్‌), సుశీల దంపతుల సౌజన్యంతో 12 పేద కుటుంబాలకు రూ.5 వేల చొప్పున రూ.60 వేలు ఆర్థిక సాయం, పండ్లు వనిత అందించారు.

జననేతకు జేజేలు

అట్టహాసంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు

జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు

ప్రతి నియోజకవర్గంలో అన్నదానం, సేవా కార్యక్రమాలు

ముదినేపల్లి మండలంలో వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ

జనాభిమానం ఉప్పొంగే1
1/4

జనాభిమానం ఉప్పొంగే

జనాభిమానం ఉప్పొంగే2
2/4

జనాభిమానం ఉప్పొంగే

జనాభిమానం ఉప్పొంగే3
3/4

జనాభిమానం ఉప్పొంగే

జనాభిమానం ఉప్పొంగే4
4/4

జనాభిమానం ఉప్పొంగే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement