లోక కల్యాణం కోసమే..
మనం స్వార్థ రహితంగా చేసే త్యాగం యజ్ఞం. యజ్ఞాల్లో సమ్రతం అనేది ప్రతి చోట వ్యక్తిగతంగా నిర్వహించేంది. శ్రోతం అంటే కేవలం లోక కల్యాణం నిమిత్తం మాత్రమే నిర్వహించేంది. లండన్‌లో స్థిరపడినా భారత్ దేశం సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ఈ యజ్ఙం నిర్వహిస్తున్నాం. దీనికి గ్రామస్తులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు.
– అక్కినప్రగడ శ్రీరాఘవేంద్రసాయి శర్మ,
వైదిక జ్యోతిష్య పరిశోధకుడు, లండన్
యజ్ఞాలు చేయడం వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. యజ్ఞం చేసేటప్పుడు అగ్ని హోమాల్లో నెయ్యి, పాలు వేయడం వల్ల వచ్చే పొగ గాలిలో కలుస్తోంది. అగ్నిహోత్రం నుంచి వెలువడే ఔషధీయుక్త వాయువు అది. మనలోని అనారోగ్య సమస్యలను తొలగిస్త్తుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు దోహదం చేస్తుంది.
– పూడిపెద్ది నరసింహ శర్మ,
వేదపండితుడు, విశాఖపట్నం
విదేశాల నుంచి వచ్చి వ్యక్తిగతంగా ఏమి ఆశించకుండా కేవలం లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ అతిరుద్ర యజ్ఞంకు అన్ని రకాల సహాయ సహకారాలు మా గ్రామ పెద్దలు, మహిళలు అందిస్తున్నాం. వచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశాం. ఈ యజ్ఞంతో మా ప్రాంతంలో వివిధ కారణాల వల్ల ఏర్పడే గాలి కాలుష్యం నివారించి వాతావరణ సమతుల్యతలను కాపాడతాయని చెబుతున్నారు.
– సరిపల్లె శంకరం, గ్రామస్తుడు, మందలపర్రు
లోక కల్యాణం కోసమే..
లోక కల్యాణం కోసమే..


