మహానేత వైఎస్సార్‌ను మరువలేం
ముదినేపల్లి రూరల్: మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికి మరువలేరని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. మండలంలోని పెనుమల్లి శివారు సింగారంలో పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైఎస్ నూతన విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అలాంటి మహానేత భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం సజీవంగా నిలిచిపోయారన్నారు. అనంతరం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన కేక్‌ను కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, మండల శాఖ అధ్యక్షుడు బోయిన రామరాజు, పార్టీ ముదిరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, జిల్లా అధికార ప్రతినిధి మోట్రు ఏసుబాబు, పుట్టి సుబ్బారావు, బేతపూడి వెంకటరమణ, వెంకటేశ్వరరావు,పృద్వీ, కొండా, నాగు, తదితరులు పాల్గొన్నారు.


