సీనియర్ నెట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
భీమవరం: ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి సీనియర్ నెట్ బాల్ పోటీలకు పురుషుల, మహిళల జట్ల ఎంపిక భీమవరం బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో నిర్వహించినట్లు నెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి విజయలక్ష్మి తెలిపారు. ఎంపిక పోటీలను బ్రౌనింగ్ కళాశాల సెక్రెటరీ మేడిది ఎస్తేరు ప్రియాంక ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారులను బ్రౌనింగ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రెసిడెంట్ శ్రీ మేడిది జాన్సన్, సెక్రటరీ ఎస్తేర్ ప్రియాంక , వైస్ ప్రెసిడెంట్ అబ్రహం, ప్రిన్సిపాల్ కే నవీన్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో నెట్ బాల్ కోచ్ అసోసియేషన్ సభ్యుడు పి దావూద్ ఖాన్, వి.వినీత్ జోసఫ్ కుమార్ పాల్గొన్నారు.
ఎంపికై న పురుషుల జట్టు
జీఎన్‌వీఎస్ విజయ్ కుమార్ (కెప్టెన్), పి శ్రీనివాసు (వైస్ కెప్టెన్) ఏ.వెంకటేష్, ఎస్.దానియలు, బి.లీల మురళీకృష్ణ, కె.మణికంఠ, పీ మిన్ను, డి.ఫణీంద్ర కుమార్, ఎం.ఎర్నెస్ట్, టి దుర్గాప్రసాద్, జి.త్రినాథ్ ఎన్.విలియం. స్టాండ్ బైస్ : కె బాల సాయి రామకృష్ణ, కే.భాస్కర్‌రావు, కె.దుర్గాగణేష్ , కేఎస్‌వీ మణికంఠ, కే.హనోక్
ఎంపికై న మహిళల జట్టు
జి.వరలక్ష్మి (కెప్టెన్), డి.నాగ నవ్య (వైస్ కెప్టెన్), కె.అక్షయ, కె.మానస, కే.శ్రీదేవి, ఎం.ఎస్తేరు, ఎన్.గంగాభవాని, టి.ఉమాభవాని, డి.జ్యోత్స్న నాగ సాయి, కె.రాము, కే.మౌనిక, పి.జ్యోతి
స్టాండ్ బైస్: కే.భారతి, ఎన్.వర్షిత నాగ భద్ర, జి.లిఖిత, ఎం.బేబీ రాణి, ఎన్.వెంకట రేష్మ.


