జగన్ ఫ్లెక్సీపై పోలీసుల హుకుం
ద్వారకాతిరుమల: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని తిమ్మాపురంలో బ్రహ్మంగారి ఆలయం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించాలని పోలీసులు సదరు నేతలను హెచ్చరించారు. టీడీపీ నాయకులు ఓర్వలేక పోలీసులను తమపైకి ఉసిగొలుపుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు ఘటనా స్థలానికి చేరుకుని ఎస్సై టి.సుధీర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాత్రి 10 గంటల తరువాత ఫ్లెక్సీని తొలగిస్తామని చెప్పారు.
రామసింగవరంలో పలువురిపై కేసు నమోదు
స్థానిక అంబేడ్కర్ విగ్రహ కూడలిలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు రాయడంతోపాటు అవి నిజం చేస్తామని బెదిరించారని టీడీపీ కార్యకర్త దొప్పసాని బాబురావు ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో ఆరుగురితో పాటు, ఫ్లెక్సీని తయారు చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.
జగన్ ఫ్లెక్సీపై పోలీసుల హుకుం


