శ్రీనివాసా.. గోవిందా
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. క్షేత్రంలోని అన్ని విభాగాలూ భక్తులతో కిటకిటలాడాయి. హరే శ్రీనివాస భజన బృంద సభ్యులు (రామానుజపురం) అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
ఏలూరు(మెట్రో): సారా తయారీదారులను ఆ పని నుంచి బయటకు తీసుకువచ్చి, వారికి ప్రత్యామ్నా య ఉపాధితో గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘మార్పు’ కార్యక్రమం పటిష్టంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో మార్పు కార్యక్రమం అమలుపై కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వా రా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా మా ర్పు కార్యక్రమాన్ని అమలు చేసే యో చనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇక్కడ పర్యటించవచ్చని అన్నారు. సబ్ కలెక్టర్ వినూత్న, ఆర్డీఓలు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు శనివారం 652 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో ఉదయం 376 మందికి 347 మంది, మధ్యాహ్నం 309 మందికి 276 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
పశ్చిమలో 91.83 శాతం హాజరు
భీమవరం: జిల్లాలో శనివారం నిర్వహించిన టెట్ పరీక్షలకు 91.83 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారా యణ తెలిపారు. ఉదయం 900 మందికి 831 మంది, మధ్యాహ్నం 801 మందికి 731 మంది హాజరయ్యారన్నారు.
శ్రీనివాసా.. గోవిందా


