మా హైస్కూల్ బాగు చేశారు
జగన్‌మామ హయాంలో శనివా రపుపేటలోని మా హైస్కూల్ బాగుపడింది. కొత్త బల్లలు, బోర్డులు, ఫ్యాన్లు, లైట్లు వచ్చా యి. భవనాలను సుందరంగా తీర్చిదిద్దారు. విజ్ఞానం పెరిగేలా గోడలపై బొమ్మలు వేశారు. టైల్స్, ఇతర సౌకర్యాలతో టా యిలెట్లు నిర్మించారు. కార్పొరేట్‌ను తలదన్నేలా మా హైస్కూల్‌ను తీర్చిదిద్దారు.
– ఎస్.కరిష్మా, శనివారపుపేట, ఏలూరు
మాది పేద కుటుంబం. మా అమ్మాయికి కాలేయ సమస్య వచ్చింది. ఏం చేయాలో తెలి యని స్థితిలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నా. వెంటనే ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది. దీంతో మా అమ్మాయికి ఆపరేషన్ పూర్తయ్యింది. నా బిడ్డకు జగన్ పునర్జన్మ ఇచ్చారు.
–ఎం.సుబ్రహ్మణ్యం, కండ్రిగగూడెం, బుట్టాయగూడెం మండలం
మాది సన్నకారు రైతు కుటుంబం. వైఎస్ జగన్ హయాంలో 2020–2024లో విద్యా, వసతి దీవెనల సాయంతో నేను బీటెక్ (ఐటీ) పూర్తిచేశాను. లేకుంటే నాకు బీటెక్ పూర్తయ్యేది కాదు. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే లండన్ వెళ్లాను. అక్కడ ఎంఎస్ చదువుతూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నా.
–దాసరి యామిని, శోభనాపురం, ఆగిరిపల్లి మండలం
మా హైస్కూల్ బాగు చేశారు
మా హైస్కూల్ బాగు చేశారు


