అప్పట్లో వ్యవసాయం పండుగ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా ఉండగా చంద్రబాబు ప్రభుత్వంలో దండగా మారింది. జగన్ హయాంలో క్రమం తప్పకుండా రైతు భరోసా సాయం రూ.13,500 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. రైతుల చెంతకే సేవలందేవి. పంటల బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇచ్చేవారు. ఇప్పుడు అవేమీ అమలు కావడం లేదు.
– పెద్దిరెడ్డి భోగయ్య, రైతు, ఎంఎంపురం, భీమడోలు మండలం
జగనన్న ప్రభుత్వంలో నాకు డ్వాక్రా రుణమాఫీ కింద రూ.లక్ష లబ్ధి చేకూరింది. మా అమ్మాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో బీటెక్ పూర్తి చేసింది. కళాశాల, హాస్టల్ ఫీజుల కింద రూ.2 లక్షలు ప్రభుత్వమే చెల్లించింది. ఆయన పుణ్యమా మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. జగన్ మేలు మరువలేం.
– నంబూరి లింగేశ్వరి, పాత చింతలపూడి, చింతలపూడి మండలం
అప్పట్లో వ్యవసాయం పండుగ


