మన్యంలో వర్జీనియా పొగాకు సాగు
బుట్టాయగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో కాసులు కురిపించే వర్జీనియా పొగాకు పంట సాగు మన్యం ప్రాంతంలో ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో రైతులు జీడిమామిడి తోటలు తొలగించి పొగాకు సాగు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకూ సుమారు 5,563 హెక్టార్లలో పొగాకు పంట సాగు చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెం–1 పరిధిలో 2330 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం–2 పరిధిలో 1,338 హెక్టార్లు, కొయ్యలగూడెం వేలం కేంద్రం పరిధిలో 1895 హెక్టార్లలో రైతులు వర్జీనీయా పంట సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుట్టాయగూడెం మండలంలో అత్యధికంగా పొగాకు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక్కొక్క రైతు 100 నుంచి 200 ఎకరాల వరకూ వర్జినీయా పొగాకు సాగు చేస్తున్నారు. మన్య ప్రాంతంలో రబీ సీజన్‌కు సంబంధించి సాగుకు సిద్ధమయ్యారు. ప్రత్తి, మొక్కజొన్న పంటలు వేయగా అత్యధికంగా పొగాకు పంటను సాగు చేస్తున్నారు.


