మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలి
ఏలూరు (టూటౌన్): పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, జీఓ నంబర్ 590, 107, 108లను రద్దు చే యాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభిస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం అందులో పది ప్రభు త్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ ప్రైవేటీకరణను సమర్థిస్తూ చంద్రబాబునాయుడు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 17న చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోకుంటే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
హామీలను ఎగ్గొట్టారు
సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఆ హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కేవలం రూ.3,500 కోట్లను మెడికల్ కళాశాలలకు కేటా యించలేక ప్రైవేటు వారికి ధారాదత్తం చేయడం దా రుణమని మండిపడ్డారు. ఏఐఎస్‌ఎఫ్ ఏలూరు జి ల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ మాట్లాడారు. ఏరి యా సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్, అడ్డగర్ల క్ష్మిఇందిరా, కార్యవర్గ సభ్యులు కొండేటి బేబి, మావూరి విజయ, కొల్లూరి సుధారాణి, కొండేటి రాంబాబు, గొర్లి స్వాతి పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలను
ప్రభుత్వమే నడపాలి
జంగారెడ్డిగూడెం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వైద్య విద్యను పేదవర్గాలకు దూరం చేయొద్దని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. పీపీపీ పద్ధతిలో నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 590ను రద్దు చేయాలని కోరుతూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేసి కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినపతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగం వారికి అప్పజెప్పడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఖండిస్తుందన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జీవీ రమణరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కారం దారయ్య, బాడిస రాము, నిమ్మగడ్డ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తున్న దృశ్యం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలి


