ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

Dec 19 2025 8:17 AM | Updated on Dec 19 2025 8:17 AM

ఉపాధి

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి నిపుణుల బృందం పరిశీలన ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి

జంగారెడ్డిగూడెం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, తక్షణమే 2025 కొత్త బిల్లు రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. గురువారం ఎ.పోలవరం గ్రామ సచివాలయం వద్ద కొత్త బిల్లు కాపీలను దహనం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.జీవరత్నం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టం తల లేని మొండెంలా ఉందన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎందుకు రద్దు చేస్తున్నారో తెలపాలన్నారు. మండల అధ్యక్షురాలు యాగంటి సీత, మండల కమిటీ సభ్యులు యర్రమల కృష్ణ, కె.సుబ్బారావు, శివయ్య, మంగ, పోతురాజు, దుర్గయ్య పాల్గొన్నారు.

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టులో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ బృందం సభ్యులు ప్రాజెక్టులో జరుగుతున్న పనులకు సంబంధించి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. గురువారం శా స్త్రవేత్తలు లలితకుమార్‌ సోలంకి, రవి అ గర్వాల్‌ నేతృత్వంలోని బృందం సభ్యులు డయా ఫ్రమ్‌వాల్‌లో వినియోగిస్తున్న కాంక్రీట్‌ నాణ్యతను తనిఖీ చేశారు. ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న కాంక్రీట్‌ నమూనాలను ల్యాబ్‌లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో గ్యాప్‌–1, గ్యాప్‌–2 ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు కాంక్రీట్‌ నాణ్యతపై పరిశీలన చేయనున్నట్టు తెలిపారు. ఎస్‌ఈ రామచంద్రరావు, డీఈలు శ్రీనివాస్‌, బాలకృష్ణ, మేఘ జనరల్‌ మేనేజర్‌ గంగాధర్‌, డిప్యూటీ జీఎం మురళీకృష్ణ ఉన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వినియోగదారుల ప్ర యోజనాల కోసం ఆర్టీసీ కార్గో సేవలను మ రింత విస్తృతపరుస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్‌ షబ్నం తెలిపారు. ఈనెల 20 నుంచి వచ్చేనెల 19 వరకూ జరిగే కార్గో డోర్‌ డెలివరీ మాసోత్సవాలకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను గురువారం స్థానిక డీపీటీఓ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్గో సేవలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఆర్టీసీ డిపోల పరిధిలో కార్గో సేవలు అందిస్తున్నామన్నారు. డోర్‌ డెలివరీ మాసోత్సవాల్లో వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ మంచి బిజినెస్‌ నిర్వహించాలని తమ సిబ్బందిని ఆదేశించామన్నారు. కలిసికట్టుగా పనిచేసి సత్ఫలితాలు సాధించాలని సూచించారు. కార్గో ఏటీఎం, ఏలూరు డిపో మేనేజర్‌ బి.వా ణి, రెండు జిల్లాల సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.బలరాముడు, పీఆర్‌ఓ కేఎల్‌ నరసింహం, కార్గో సిబ్బంది పాల్గొన్నారు.

ఏలూరు(మెట్రో): ఫిబ్రవరి 5న నిర్వహించే ఏపీ జేఏసీ అమరావతి ‘రాష్ట్ర మహాసభ’ను జ యప్రదం చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం ఏలూరులోని రె వెన్యూ భవనంలో ఇతర రాష్ట్ర నాయకులతో క లసి జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ యవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు నిర్వహించనున్న రాష్ట్ర మహాసభకు రాష్ట్రంలోని 92 డిపార్టుమెంటు సంఘాలకు సంబంధించిన సభ్యులు హాజరుకానున్నారన్నారు. మహాసభకు సన్నాహకంగా విజయవాడ దగ్గరలోని జిల్లాల సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర మహాసభకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదర్‌ మాట్లాడుతూ మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలనుకుంటే వేలాదిగా హాజరుకావాల్సిందిగా పిలుపునిచ్చారు. నాయకులు టీవీ ఫణి పేర్రాజు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి 1
1/2

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి 2
2/2

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement