గర్జించిన జనకోటి | - | Sakshi
Sakshi News home page

గర్జించిన జనకోటి

Dec 16 2025 4:37 AM | Updated on Dec 16 2025 4:37 AM

గర్జి

గర్జించిన జనకోటి

కమీషన్ల కోసమే ప్రైవేటీకరణ

చంద్రబాబు క్రెడిట్‌ చోరీ

ప్రజాగళం నినదించింది.. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క సంతకంతో ప్రారంభమైన ప్రస్థానం కోటి సంతకాలకు చేరి కోటి గొంతుకలుగా గర్జించింది. చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకోగా.. నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లాలో మహోద్యమంలా సాగింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన కోటి సంతకాల పత్రాలతో ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించి ప్రత్యేక వాహనంలో తాడేపల్లికి పంపారు.

సాక్షి ప్రతినిధి,ఏలూరు: వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కీలక ఘట్టం సోమవారం ముగిసింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. అనంతరం అక్కడ నుంచి రైల్వేస్టేషన్‌ సెంటర్‌కు చేరుకుని ఫ్లై ఓవర్‌ మీదుగా పాతబస్టాండ్‌ సెంటరులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ కొనసాగింది. వేలాదిగా హాజరైన భారీ ర్యాలీలో ఏలూరు పార్లమెంట్‌ పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌, పార్లమెంట్‌ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, కొఠారు అబ్బయ్యచౌదరి, పుప్పాల వాసుబాబు, తెల్లం బా లరాజు, మామిళ్లపల్లి జయప్రకాష్‌, కంభం విజయరాజుతో పాటు పార్టీ ముఖ్యనేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ప్రజా ఉద్యమంతో నూతనోత్తేజం

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం పార్టీ కేడర్‌లో నూతనోత్తేజం నింపింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు భారీ ర్యా లీలో పాల్గొన్నారు. తొలుత కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి ర్యాలీని పార్లమెంట్‌ పరిశీలకుడు రవీంద్రనాథ్‌, జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌, పార్లమెంట్‌ ఇన్‌చార్జి, యుజన విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కారుమూరి సునీల్‌కుమార్‌, ఏలూరు ఇన్‌చార్జి జయప్రకాష్‌, బీసీ సెల్‌ జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నౌడు వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. భారీ ర్యాలీని వందలాది ద్విచక్రవాహనాలు, కార్లు అనుసరించాయి. రైల్వేస్టేషన్‌ సెంటర్‌లో ప్రారంభమైన ర్యాలీ సీఎస్‌ఐ చర్చి సెంటర్‌, రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌ వరకూ కొనసాగింది. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మెడికల్‌ కళాశాలను చూపిస్తూ

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఏలూరులో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను పార్టీ నేతలు ర్యాలీలో ప్రత్యేకంగా చూపించారు. ఇది జగనన్న కట్టిన మెడికల్‌ కాలేజీ, వందల మంది వైద్య విద్యార్థులకు ఉపయోగపడుతుందంటూ.. ఇప్పటికై నా పద్ధతి మార్చుకో చంద్రబాబు అంటూ నినదించారు. అనంతరం భారీ ర్యాలీకి ఏలూరు న్యాయవాదులు మద్దతు పలికి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. భారీ నిరసన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు దయాల నవీన్‌బాబు, బూత్‌ కమిటీ జోన్‌–2 అధ్యక్షుడు బీవీఆర్‌ చౌదరి, వడ్డీల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ముంగర సంజయ్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శులు నూకపెయ్యి సుధీర్‌బాబు, డీవీఆర్‌కే చౌదరి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగా సందీప్‌, జిల్లా మహిళ అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు జానకిరెడ్డి, రాష్ట్ర యువజన విభా గం అధికార ప్రతినిధి కందుల దినేష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్‌, ఏలూరు మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు తేరా ఆనంద్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్‌, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జిల్లా యువజన అధ్యక్షుడు కామిరెడ్డి నాని, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్‌, డాక్టర్‌ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కేవీఎస్‌ రామకృష్ణ, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, అంగన్‌వాడీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు స్వాతి యాదవ్‌, జెడ్పీటీసీలు మండల సరస్వతి, నిట్టా లీలానవకాంతం, బత్తుల రత్నకుమారి, అప్పన ప్రసాద్‌, జానంపేట బాబు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయ్‌బాబు, పార్టీ నాయకులు కాశీ, తాళ్లూరి ప్రసాద్‌, చిక్కాల దుర్గాప్రసాద్‌, దొంతశెట్టి సత్యనారాయణ, యూనిస్‌ పాషా, పిల్ల చరణ్‌, జిజ్జు వెంకటేశ్వరరావు,చింతా అనిల్‌, స్టాన్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.

నృత్యాలు చేస్తున్న యువకులు వైఎస్సార్‌సీపీ జెండాలతో యువతులు ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులు

ప్రైవేటుపై నిరసన ‘సంతకం’

వైద్య విద్య ప్రైవేటీకరణపై నినదించిన ప్రజాగళం

కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ కేడర్‌

ఏలూరులో భారీ ర్యాలీ

మెడికల్‌ కళాశాలను చూపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన నేతలు

జిల్లాలోని కోటి సంతకాల ప్రతులు తాడేపల్లికి తరలింపు

మెడికల్‌ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టడం నీతిమాలిన చర్య. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోంది. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణకు పూనుకుంది. కోటి గొంతుకుల నిరసన చూసైనా తక్షణమే ప్రైవేటీకరణ నిలిపివేయాలి. లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. దేశచరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 17 కళాశాలలు రా ష్ట్రానికి మంజూరై 5 కళాశాలలు పూర్తయ్యాయి.

– దూలం నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు

సీఎం చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్‌ కళాశాల కూడా తీసుకురాలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో తెచ్చిన 17 కళాశాలల్లో 10 కళాశాలల ప్రైవేటీకరణకు పూనుకోవడం దారుణం. ఈ కళాశాలలను ప్రభుత్వమే పూర్తి చేస్తే క్రెడిట్‌ వైఎస్‌ జగన్‌కు వస్తుందని, క్రెడిట్‌ చోరీలో భాగంగా ప్రైవేటుకు అప్పగించి కమీషన్ల రూపంలో లబ్ధి పొందాలని చూస్తున్నారు.

– వంకా రవీంద్రనాథ్‌, ఎమ్మెల్సీ, పార్లమెంట్‌ పరిశీలకుడు

గర్జించిన జనకోటి1
1/4

గర్జించిన జనకోటి

గర్జించిన జనకోటి2
2/4

గర్జించిన జనకోటి

గర్జించిన జనకోటి3
3/4

గర్జించిన జనకోటి

గర్జించిన జనకోటి4
4/4

గర్జించిన జనకోటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement