జాతీయ పోటీలకు పెదవేగి విద్యార్థులు
పెదవేగి: రాష్ట్ర స్థాయి అండర్–17 సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానం సాధించింది. దీనిలో పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు తొమ్మిది మంది పాల్గొన్నారు. దుర్గారావు, సంపత్‌లు జాతీయ స్థాయి పోటీలకు, రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ ఎం.రమేష్‌బాబు, వైస్ ప్రిన్సిపాల్ నిర్మలకుమారి, జేసీ వై.శ్రీనివాసరావు, పీడీ కె.జయరాజు అభినందించారు.
కొయ్యలగూడెం: అతి వేగం, నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలిగొంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం – జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై కొత్తూరు క్రాస్ రోడ్డు (పులి వాగు శివాలయం) వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాడాల గ్రామానికి చెందిన ప్రత్తి జయరాజు (50), అతని భార్య సత్య (42) బైక్‌పై జంగారెడ్డిగూడెంలోని తమ కుమార్తె బిడ్డ బారసాలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో ఢీకొట్టింది. భార్యాభర్తలు ఇద్దరికీ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్రక్ డ్రైవర్ మితిమీరిన వేగంతో పాటు నిర్లక్ష్యంగా ఆటోను నడపడం వల్ల ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


