టీచర్ల ఆత్మ గౌరవ దీక్ష | - | Sakshi
Sakshi News home page

టీచర్ల ఆత్మ గౌరవ దీక్ష

Dec 16 2025 4:37 AM | Updated on Dec 16 2025 4:37 AM

టీచర్

టీచర్ల ఆత్మ గౌరవ దీక్ష

టీచర్ల ఆత్మ గౌరవ దీక్ష గంగానమ్మ సన్నిధిలో హోం మంత్రి యూరియా కొరత లేదు 16న మెగా పరిష్కార వేదిక టెట్‌కు 66 మంది హాజరు నేడు డీసీఓ కార్యాలయం వద్ద ధర్నా

ఏలూరు (టూటౌన్‌): సీఆర్‌ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ సీఆర్‌ఎం ఉపాధ్యాయు లు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఆత్మ గౌరవ దీక్ష నిర్వహించారు. ఏపీసీఆర్‌ఎం టీచర్స్‌ యునైటెడ్‌ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో వక్తలు మాట్లాడుతూ కచ్చితమైన జాబ్‌చార్ట్‌ అమలు చేయాలని, తమకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న సీఆర్‌ఎం, ఎంటీఎస్‌ పోస్టులను భర్తీ చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సీఆర్‌ఎంలు తరలివచ్చారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో జరుగుతున్న జాతరలో భాగంగా వివిధ ప్రాంతాల్లోని మేడల్లో కొలువైన అమ్మవార్లను హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. స్థానిక తూర్పువీధి గంగానమ్మ ఆలయంలో అమ్మవార్లను ద ర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే ప డమర వీధి ప్రాంతంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ ఉన్నారు.

ఏలూరు(మెట్రో): జిల్లాలో యూరియా, ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్‌ బాషా తెలిపారు. రబీ సీజన్‌కు జిల్లాలో పూర్తిస్థాయిలో యూరియా నిల్వలు ఉన్నాయ న్నారు. డీలర్లు ఎరువులను ఎంఆర్‌పీ కంటే ఎ క్కువ ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఎరువుల సంబంధిత ఫిర్యా దులు ఉంటే సమీప వ్యవసాయ కార్యాల యాన్ని లేదా తహసీల్దార్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఏలూరు(మెట్రో): జిల్లాలో 22ఏ కేసుల పరిష్కారానికి ఈనెల 16న ఏలూరులో మెగా పరి ష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 9 గంటల నుంచి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఇన్‌చార్జ్‌ మంత్రి నాదెండ్ల మనోహర్‌, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సో మవారం 66 మంది అభ్యర్థులు హాజరయ్యా రు. సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో మధ్యాహ్నం పరీక్షకు 66 మందికి 66 మంది హాజరయ్యారు. ప రీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు.

పశ్చిమలో 96 శాతం హాజరు

భీమవరం: జిల్లాలో ఏపీ టెట్‌ పరీక్షలకు 96 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ. నారాయణ తెలిపారు. ఉదయం 95 మందికి 90 మంది, మధ్యాహ్నం 100 మందికి 97 మంది హాజరయ్యారన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో భాగంగా మంగళవారం ఏలూరు జిల్లా సహకార అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు రాష్ట్ర స హకార సంఘాల ఉద్యోగుల సంఘం జిల్లా అ ధ్యక్షుడు కాళంగి వీరవెంకట సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న స హకార సంఘాల ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

టీచర్ల ఆత్మ గౌరవ దీక్ష 1
1/2

టీచర్ల ఆత్మ గౌరవ దీక్ష

టీచర్ల ఆత్మ గౌరవ దీక్ష 2
2/2

టీచర్ల ఆత్మ గౌరవ దీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement