బాల కార్మికుల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్
ఏలూరు (టూటౌన్): బాల కార్మికుల గుర్తింపునకు మంగళవారం నుంచి 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. స్థానిక న్యాయసేవా సదన్ భవన్‌లో ప్రత్యేక డ్రైవ్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు ప్రత్యేక తనిఖీలు చేపడతారన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ పుచ్చల వెంకటేశ్వరరావు మా ట్లాడుతూ పశ్చిమబెంగాల్, ఒడిసా, చత్తీస్‌గఢ్ నుంచి బాల కార్మికులను గుర్తించి వారికి విద్యపై అవగాహన కల్పించాలన్నారు. క్రాప్ జిల్లా కో–ఆర్డినేటర్ ఆర్.వినోద్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాని బా ల కార్మికరహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జి.నాగేశ్వరరావు, లేబర్ ఆఫీసర్ జీవీ రమణ, జె.గోపాలృష్ణ, ఏఎల్‌ఎస్ కో–ఆర్డినేటర్ ఎస్.నాగేశ్వరరావు చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ వై.వెంకట్ రాజు, జి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.


