ఇండోర్ కళకళలు ఏనాటికో?
ఏలూరు ఇండోర్ స్టేడియం పేరు చెబితే బాలబాలికలు, సీనియర్ క్రీడాకారుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. రెండేళ్ల క్రితం వరకు పిల్లలు, పెద్దల ఆటలతో ఇండోర్ కళకళలాడేది. పదుల సంఖ్యలో బాలబాలికలు బ్యాడ్మింటన్, జూడో ఇతర క్రీడల్లో సాధన చేసేవారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలతో స్డేడియం సందడిగా ఉండేది. ఇక్కడ నిర్వహించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో జిల్లా పిల్లలు రాణించారు. మెడల్స్, షీల్డ్స్, పతకాలతో పాటు పేరు, ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇదంతా గతం. సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఇండోర్ గత ఏడాది వర్షాలకు తడిచి రాత్రివేళ పైకప్పు కూలిపోయింది. అప్పటి నుంచి ఇందులో పోటీల నిర్వహణ, సాధన నిలియిపోయాయి. అధికారులు స్టేడియం శిథిలాలు తొలగించి మిన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తి కావస్తున్నా నేటికీ స్టేడియం నిర్మాణం చేపట్టకపోవడంపై క్రీడాభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. ఇప్పటికై నా ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
– ఏలూరు రూరల్
ఇండోర్ స్టేడియం పునర్నిర్మించకపోవడం విచారకరం. ప్రభుత్వం ఆటలకు ప్రాధాన్యత ఇస్తాం అంటుంది కాని, పనులు కనిపించడం లేదు. నేనే ప్రతిరోజూ వాకింగ్ చేసేన తర్వాత ఇందులో ఉన్న జిమ్‌లో కొద్దిసేపు సాధన చేసేవాడిని. జిమ్ కూడా మూసివేశారు. ఇక గత్యంతరం లేక ఇతర ప్రాంతాల్లో వాకింగ్ చేస్తున్నాను.
– సుభాని, వాకర్
మా సీనియర్స్ ఇండోర్‌లో ఆడుకుని మంచి ప్లేయిర్స్ అయ్యారు. మా ఇంటి దగ్గరి స్టేడియంకు వెళ్లి ఆడుకోమంటున్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో ఆరుబయటే ఆడుకుంటున్నాను. బయట షటిల్ కాక్ గాలికి అటు, ఇటు పోతోంది. ఇండోర్‌లో చక్కగా ఆడుకోవచ్చు.
– పగ్నేష్
ఇండోర్ కళకళలు ఏనాటికో?
ఇండోర్ కళకళలు ఏనాటికో?


