ప్రశ్నిస్తే దేశద్రోహులంటారా..?
52 వేల సంతకాల సేకరణ
దెందులూరు : ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వైఎ స్సార్‌సీపీ నేతలను దేశద్రోహులనడం ఎంతవరకు సబబు అని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తుందని, నిర్మాణాత్మక విషయాలపై ప్రశ్నిస్తామని వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం, వేధించడం తగదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా పాలన అందించామ ని, సేవాభావంతో సొంత ఖర్చులతో నాయకులు మూడుసార్లు గడపగడపకూ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఆరు నెలల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా పూర్తి కాలేదని, ప్రాజెక్టు ఎప్పటిలోపు పూర్తిచేస్తారో చెప్పా లని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దెందులూరు నియోజకవర్గంలో సుమారు 12 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో పక్కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించామన్నారు. అలా గే ప్రస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వైఎస్సార్‌సీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు బడులకు వెళ్లి భోజనాన్ని రుచి చూడాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలోని నా లుగు మండలాల్లో 17 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, 169 కాలనీలు ఏర్పడగా ఇప్పటికీ రోడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. అలాగే మౌలిక వసతులను కల్పించలేదన్నారు.
కొల్లేరు నుంచి వలసలు
చంద్రబాబు ప్రభుత్వంలో కొల్లేరు నుంచి నివాసితులు వలస వెళ్లే పరిస్థితి వచ్చిందని అబ్బయ్యచౌ దరి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి వచ్చి కొల్లేరులో ఉపాధి పొందేవారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కొల్లేరు నుంచి వలస వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు. రెండు వేల ఎకరాల్లో ఎస్సీ, బీసీల సొసైటీ భూములకు అన్యాయం జరుగుతోందన్నారు. వలసలు ఆపాలని, సొసైటీలో చెరువులు ఉన్న వారికి న్యాయం చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో పలు రోడ్లకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, కొన్ని ప్రతిపాదనలు పంపామని, ఇప్పుడు అవన్నీ ఎందుకు పూర్తికాలేదని అబ్బ య్యచౌదరి ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆగ్రహం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా నియోజకవర్గంలో 52 వేల సంతకాల సేకరించామన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఏలూరు అశోక్‌నగర్‌లోని పార్టీ క్యాంపు కార్యాలయానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని, అ క్కడి నుంచి ర్యాలీగా జిల్లా కార్యాలయం నుంచి తాడేపల్లికి సంతకాల ప్రతులు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, పార్టీ మండల అధ్యక్షులు కామిరెడ్డి నాని, అప్పన ప్రసాద్ , జానంపేట బాబు, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నిట్ట గంగరాజు, ఫారెస్ట్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, న్యాయవాది లక్ష్మీనారాయణ, నాయకులు ఉన్నారు.


