30న ఉత్తర ద్వార దర్శనం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో వైకుంఠ (ముక్కోటి) ఏకా దశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 30 న శ్రీవారి ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి ఆ దివారం తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. రూ.100, రూ.200, రూ.500ల ప్రత్యేక దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ముక్కోటి ముందు రోజు ఈనెల 29న గిరి ప్రదక్షిణను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆ రోజు మ ధ్యాహ్నం 2.30 గంటలకు స్వామి వారి తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అ నంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ఈనెల 30 నుంచి వచ్చేనెల 9 వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహిస్తామని, ఆయా రోజుల్లో సా యంత్రం వేళ ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 15న స్వామివారి నిత్యార్జిత కల్యాణా న్ని రద్దు చేస్తున్నట్టు ఈఓ వివరించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో ఆదివారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 179 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో 200 మందికి గాను 179 మంది హాజరు కాగా 21 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
ఏలూరు టౌన్: జిల్లాలో నేరాలను నిరోధించేందుకు పటిష్ట భద్రతా ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని జి ల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ తెలిపారు. స్థానిక జి ల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోషల్ సర్వీస్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్)లో భాగంగా నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులకు స్కోర్–10 సంస్థతో ప్రత్యేకంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఈ సంస్థ తన సీఎస్‌ఆర్‌లో భాగంగా ఏలూరులో ఆటో డ్రైవర్లకు రూ.లక్ష ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అలాగే నగరంలోని మాల్స్‌లో పనిచేసే సిబ్బంది, లాడ్జీల్లో వసతి పొందే వ్యక్తులు, అద్దె ఇళ్లలో నివసించే వ్యక్తుల వివరాలు సేకరించటంలో స్కోర్–10 సంస్థ ప నిచేస్తుందన్నారు. ఆయా వ్యక్తుల వివరాలను ఈ సంస్థ యాజమాన్యం దర్యాప్తు చేసి నిమిషాల వ్యవధిలోనే పూర్తి వివరాలు, నేర చరిత్ర ఉంటే తెలియజేస్తారని స్పష్టం చేశారు. సమాజంలో నేరగాళ్లను అడ్డుకునేందుకు ఇదో అవకాశంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, ట్రాఫిక్ సీఐ, టూటౌన్ ఇన్‌చార్జి సీఐ లక్ష్మణరా వు, త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, స్కోర్–10 సంస్థ డైరెక్టర్ నారాయణ, స్వరూప్ పాల్గొన్నారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తెలుగుదేశం పార్టీ నాయకుడు వావి వరుసలు మరిచి పిన్ని వరుస అయి న మహిళతో రాసలీలలు సాగిస్తున్న విషయం వెలుగు చూడటంతో ఆ మహిళ కుటుంబసభ్యులు అతనికి దేహశుద్ధి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పాలకొల్లు నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఆ నాయకుడు గతంలో అదే మండలంలో టీడీపీ నుంచి జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడు. ఇటీవల అతను పిన్ని వరుస అయిన మహిళతో రాసలీలలు సాగిస్తున్నాడు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో వారు ఆ నాయకుడిని నిలదీశారు. వావి వరుసలు మరిచి ఈ నీచ పనులు ఏమిటంటూ ప్రశ్నించారు. ఈ క్ర మంలోనే ఆవేశం తట్టుకోలేక ఆ నాయకుడికి దేహశుద్ధి కూడా చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మహిళను లోబరుచుకోవడానికి అత ను అంగన్‌వాడీలో పోస్టు ఇప్పిస్తానని ఆశ చూపించినట్టు ఆమె బంధువులు ఆరా తీయగా తెలిసింది. కావలసిన వాడివి అయ్యుండి ఇంత నీచానికి పాల్పడతావా అంటూ వారు ఆ నా యకుడికి దేహశుద్ధి చేసి పెద్ద రాద్ధాంతమే చేసినట్టు సమాచారం. చివరికి కాళ్ల బేరానికి వచ్చిన సదరు నాయకుడు తప్పయిపోయిందని, రాజకీయంగా ఎదుగుతున్న తనను అల్లరి చేయొద్దని, క్షమించి వదిలేయండని వారి కాళ్లు ప ట్టుకుని రాజీ చేసుకున్నట్టు తెలిసింది. మంత్రి ఇలాకాలోని టీడీపీ నాయకుడి విషయంలో ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సదరు నాయకుడికి గతంలో నియోజకవర్గంలోని ప్రధాన నాయకుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.


