కూటమి పాలనలో రైతులకు ఇబ్బందులు
నిడమర్రు: కూటమి ప్రభుత్వంలో తాము ఇ బ్బందులు పడుతున్నామంటూ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వద్ద కొల్లేరు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తోకలపల్లిలో జరిగిన సమావేశంలో పలువురు కొల్లేరు రైతులు మంత్రి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. రైతు బలే ఆదినారాయణతోపాటు ప లువురు మాట్లాడుతూ 3వ కాంటూరులో తా తల కాలం నుంచి హక్కుగా వస్తున్న భూము ల్లో సంప్రదాయబద్ధంగా వ్యవసాయం చేసు కుంటున్నామని, ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలో తమకు ఇబ్బందులు లేవన్నారు. అయితే ఇ టీవల అటవీ శాఖ అధికారులు సంప్రదాయ వ్యవసాయం చేసుకుంటున్న రైతులపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైతుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ముందుగా పత్తేపురంలో ఇంటి నిర్మాణాల కాలనీని మంత్రి ప్రారంభించారు. అలాగే విద్యుత్ సబ్‌స్టేషన్ పనుల భూమి పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఉన్నారు.


