ఫీజుల చెల్లింపునకు గడువు పొడిగింపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ కోర్సుల పబ్లిక్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు గడువు పొడిగించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు ఇంటర్‌కు రూ.150, ప్రాక్టికల్స్‌కు రూ.100, టెన్త్‌కు రూ.100 చెల్లించాలన్నారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 19 వరకూ, రూ.25 అపరాధ రుసుంతో 20 వరకు, రూ.50 అపరాధ రుసుంతో 22వరకూ, తత్కాల్‌లో ఈనెల 24 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. టెన్త్ పరీక్షలు వచ్చే మార్చి 16 నుంచి 28 వరకు, ఇంటర్ పరీ క్షలు మార్చి 2 నుంచి 13 వరకూ, ఇంటర్ ప్రాక్టికల్స్ ఏప్రిల్ 11 నుంచి 18 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.


