పల్స్‌పోలియోకు పటిష్ట ఏర్పాట్లు
ఈవీఎం గోడౌన్ తనిఖీ
కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగు మెషీన్ల గోడౌన్‌ను గురువారం కలెక్టరు కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. భధ్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఏలూరు (మెట్రో): జిల్లాలో ఈనెల 21 నుంచి 23 వరకు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 2 లక్షలకు పైగా ఉన్నారని, అవసరమైన వాక్సిన్ డోసులు సిద్ధం చేయాలన్నారు. ఈనెల 21న 1,707 వ్యాక్సినేషన్ కేంద్రాలు, 72 మొబైల్ కేంద్రాల ద్వారా పల్స్ పోలియో వాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా కేంద్రాలు ఏర్పాటుచేసి పోలియో వాక్సిన్ వేయాలన్నారు. అనంతరం 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వాక్సిన్ తీసుకొని చిన్నారులను గుర్తించి పోలియో వాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. పల్స్ పోలియోపై ముద్రించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డా.పీజే అమృతం, డీసీహెచ్‌ఎస్ డా.పాల్ సతీష్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
పెన్షన్లు, రేషన్ పంపిణీ, అన్నా క్యాంటీన్ల నిర్వహణ, రైతులకు, ఆసుపత్రుల్లో రోగులకు సేవలు, తదితర అంశాల్లో ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు తెలియజేశారు. గరువారం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.


