ఏలూరులో పోలీస్ ఫుట్ పెట్రోలింగ్
ఏలూరు టౌన్: ఏలూరులో ట్రాఫిక్ సమస్యలపై ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ స్వయంగా రంగంలోకి దిగారు. నగరంలోని ప్రధాన రోడ్లపై నడుచుకుంటూ వెళుతూ ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఫైర్‌స్టేషన్ సెంటర్, ఆర్‌ఆర్‌పేట, కొత్తబస్టాండ్ ప్రాంతాలను డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఆయన పర్యవేక్షించారు. పుట్‌పాత్‌లపై వ్యాపారులను సైతం ఆరా తీశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆయన పోలీస్ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇష్టారాజ్యంగా రోడ్లపై మోటారు సైకిళ్లు పెట్టడం, వ్యాపారాలు సాగిస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు భద్రతా భావం పెంపొందించటం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా పోలీస్ ఫుట్‌పెట్రోలింగ్ చేపట్టినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలు, స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లోనూ నిఘా మరింత పెంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ ఫుట్‌పెట్రోలింగ్‌లో ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణబాబు, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
స్వయంగా రంగంలోకి ఎస్పీ శివకిషోర్


