మోదెల గ్రామాన్ని సందర్శించిన అధికారులు
వేలేరుపాడు: మండలంలో అత్యంత మారుమూల అటవీ ప్రాంత గ్రామమైన మోదెల గ్రామాన్ని అధికారులు గురువారం సందర్శించారు. ఈ గ్రామంలో ఇటీవల జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు గ్రామ కొండరెడ్లు ఎస్టీ కమిషన్ సభ్యులకు వివరించారు. దీనిపై స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు గ్రామంలో 18 ఇళ్ల కాలనీలను మంజూరు చేయించారు. బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ ఫోన్ టవర్‌ను మంజూరు చేశారు. ఈ గ్రామం రిజర్వ్ ఫాస్ట్‌లో ఉండడంతో హౌసింగ్ కాలనీ నిర్మాణానికి ఆటకంగా ఉంది. దీంతో గ్రామాన్ని కుక్కునూరు రేంజ్ ఆఫీసర్ కె.కృష్ణకుమారి, సెక్షన్ ఆఫీసర్ పెరుమళ్ల, వేలేరుపాడు ఎంపీడీవో శ్రీహరి, విద్యుత్ శాఖ శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ తహసీల్దార్ సురేంద్రకుమార్ తదితరులు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో శ్రీహరి పరిశీలించారు.


