ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం

Dec 11 2025 8:18 AM | Updated on Dec 11 2025 8:18 AM

ప్రైవ

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం

అర్ధరాత్రి అగ్నిప్రమాదం నేరాలు చేశారు.. చిక్కారు

న్యూస్‌రీల్‌

అర్ధరాత్రి అగ్నిప్రమాదం
షార్ట్‌ సర్క్యూట్‌తో తణుకు సజ్జాపురంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన తండ్రి పిల్లలను కాపాడి బయటకు తీసుకువచ్చారు. 8లో u

ఏలూరు జిల్లాలో నేరాలకు పాల్పడిన దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను నుంచి రూ.35 లక్షల సొత్తు రికవరీ చేశారు. 8లో u

గురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజాభిమానం వెల్లువెత్తింది.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సామాన్యులు నిరసన గళమెత్తారు. ఒక్కొక్క సంతకంగా ప్రారంభమైన కోటి సంతకాల ప్రజా ఉద్యమం మహోద్యమంలా మారింది. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల పత్రులతో భారీ ర్యాలీలు నిర్వహించి ప్రత్యేక వాహనాల్లో ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయానికి పంపారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి గడపను పలకరించి ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలను ప్రజలకు వివరించి రాష్ట్రం నష్టపోతున్న తీరును ప్రతి ఒక్కరికీ వివరించారు. పర్యవసనంగా జిల్లాలో లక్షలాది సంతకాల సేకరణ జరిగింది. అనేక నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి సంతకాలు చేయడం విశేషం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత రెండు నెలలుగా నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమం ముగింపునకు చేరింది. బుధవారం అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం కోటి సంతకాల పత్రులను ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్టా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావుకు అందించారు. 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన లక్షలాది సంతకాల పత్రాలను నియోజకవర్గాలవారీగా ఏర్పాటు చేశారు. అనంతరం వచ్చే వారంలో జిల్లా నుంచి భారీ ర్యాలీగా తాడేపల్లికి కోటి సంతకాల పత్రులను తరలించనున్నారు. ఈ క్రమంలో బుధవారం అనేక నియోజకవర్గాల్లో పాదయాత్రలు, బైక్‌ ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

కై కలూరు నియోజకవర్గంలో..

కై కలూరు నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో కోటి సంతకాల పత్రాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ఏలూరు రోడ్డు సీఎన్‌ఆర్‌ రోడ్డు వరకు భారీ బైక్‌ ర్యాలీ జరిగింది. అనంతరం దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కోటి సంతకాల ప్రజా ఉద్యమంతో ప్రభుత్వానికి ఇప్పటికై నా కనువిప్పు రావాలని తక్షణమే వైద్యకళాశాల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

నూజివీడులో..

నూజివీడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు నేతృత్వంలో జరిగిన ర్యాలీలో ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు. నూజివీడు చినగాంధీబొమ్మ సెంటర్‌ నుంచి మార్కెట్‌ యార్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

పోలవరం నియోజకవర్గంలో..

పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో పార్టీ సమన్వయకర్త తెల్లం బాలరాజు నేతృత్వంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కొయ్యలగూడెం నుంచి గవరవరం వరకు భారీ బైక్‌ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకుడు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు.

ఉంగుటూరు నియోజకవర్గంలో..

ఉంగుటూరు నియోజకవర్గం గణవపరం మండలం బువ్వనపల్లిలో నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు పార్టీ కార్యాలయం నుంచి దివంగత వైఎస్సార్‌ విగ్రహం సెంటర్‌ వరకు బైక్‌ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఏలూరు పార్టీ కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలను తీసుకువచ్చి జిల్లా అధ్యక్షుడికి అప్పగించారు.

దెందులూరు నియెజకవర్గంలో..

దెందులూరు నియెజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి నేతృత్వంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. వేగవరం నుంచి ఏలూరు వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల పత్రాలను అందచేశారు.

ఏలూరు నియోజకవర్గంలో.. ఏలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ నేతృత్వంలో భారీ పాదయాత్ర నిర్వహించి కోటి సంతకాల పత్రులను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేశారు. పవరుపేట రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్‌ఆర్‌పేట మీదుగా విజయవిహార్‌ సెంటర్‌ వరకు కార్యక్రమం నిర్వహించి పత్రాలు జిల్లా పార్టీ కార్యాలయానికి అప్పగించారు.

చింతలపూడి నియోజకవర్గంలో..

చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కంభం విజయరాజు నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి మార్కెట్‌ యార్డు వరకు భారీ బైక్‌, కార్ల ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల పత్రులను ప్రత్యేక వాహనంలో ఏలూరు తరలించి జిల్లా అధ్యక్షుడికి అందించారు.

కుట్రలపై కోటి గర్జన

ఏలూరులో భారీ ర్యాలీ

7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతులతో భారీ ర్యాలీలు

ఏలూరు జిల్లా కార్యాలయానికి చేరిన కోటి సంతకాల పత్రాలు

బైక్‌ ర్యాలీలు, పాదయాత్రలతో నియోజకవర్గాల్లో కొత్త జోష్‌

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం 1
1/5

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం 2
2/5

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం 3
3/5

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం 4
4/5

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం 5
5/5

ప్రైవేట్‌పై వెల్లువెత్తిన ప్రజాగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement