సంపద సృష్టి ఇదేనా?
సంపద సృష్టిస్తానని నమ్మించి, అధికారంలోకి వచ్చిన అనంతరం చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారు. వేలకోట్ల విలువైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు.
– లంకలపల్లి గణేష్,
వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏలూరు నగరంలో చేపట్టిన ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారులు అందరూ భాగస్వాములు అయ్యారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువస్తే.. చంద్రబాబు ప్రైవేటీకరణ చేయటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– మున్నుల జాన్‌గురునాథ్,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి
సమష్టి కృషితో సాధ్యం లేనిది ఏదీ లేదు. దెందులూరు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణకు పార్టీ కార్యకర్తలు, నాయకులు అద్భుతంగా స్పందించారు. గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టాం.
డీవీఆర్‌కే చౌదరి,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ముమ్మాటికి తప్పే. పేదలకు శాశ్వతంగా ఉచిత విద్య వైద్యం దూరం చేస్తే రాష్ట్రంలో పేదలందరూ తిరగబడతారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది.
– అంగడాల వెంకటేశ్వరరావు,
ఎంపీటీసీ, మేదినరావుపాలెం
సంపద సృష్టి ఇదేనా?
సంపద సృష్టి ఇదేనా?
సంపద సృష్టి ఇదేనా?


