ప్రైవేటీకరణ నిర్ణయం విరమించుకోవాలి
ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే పేదలకు విద్య, వైద్యం కూడా దూరమవుతుంది. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే సంఘటితంగా ఉద్యమిస్తాం.
– బన్నే వినోద్ కుమార్,
పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు
కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇంతటి ప్రజాదరణ వస్తుందని ఊహించలేదు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.
తాళ్లూరి ప్రసాద్,
వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు
ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చి సహకరించారు. మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నిర్వహిస్తే పేద పిల్లలకు మెడికల్ సీట్లతో పాటు వైద్యం కూడా ఉచితంగా అందుతుందని ప్రజలు గ్రహించారు. సంక్షేమం పథకాలు అందక పడుతున్న ఇబ్బందులు ప్రజలు తెలిపారు.
– మరడ మంగరావు,
వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, ఉంగుటూరు
విద్య, వైద్యాన్ని ఈ ప్రభుత్వం వ్యాపారంగా మారుస్తోంది. అందులో భాగంగానే వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి.
– వినుకొండ సూరిబాబు,
రేచర్ల, చింతలపూడి మండలం
ప్రైవేటీకరణ నిర్ణయం విరమించుకోవాలి
ప్రైవేటీకరణ నిర్ణయం విరమించుకోవాలి
ప్రైవేటీకరణ నిర్ణయం విరమించుకోవాలి


