చంద్రబాబు ప్రభుత్వ పతనం ఖాయం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు
ప్రైవేట్ బస్సుల్లో తనిఖీల్లో భాగంగా గత సోమవారం నుంచి శనివారం వరకూ ఏలూరు జిల్లాలో 72 కేసులు నమోదు చేసి రూ. 7,65,230 ఫైన్ విధించారు. 8లో u
భీమడోలు: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, కూటమి పతనం ఖాయమని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. పూళ్లలో కోటి సంతకాల సేకరణలో భాగంగా శనివారం రాత్రి నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎం పురం, కోడూరుపాడు జనసేన కార్యకర్తలు ఆ పార్టీలను వీడి వాసుబాబు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువాలు వేసి వారిని వాసుబాబు ఆహ్వానించారు. ఎంఎం పురానికి చెందిన టీడీపీ నాయకులు కందవల్లి గాబ్రియేలు, కోడూరుపాడుకు చెందిన జనసేన కార్యకర్తలు లంకపల్లి మధు, సోమాల శామ్యూల్, దాసరి ప్రవీణ్, మారిశెట్టి సాయిరాం, బొల్లారపు ప్రేమ్‌రాజ్, నిట్టా మహేంద్రతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. వాసుబాబు మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు శూన్యమని, ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కందులపాటి శ్రీనివాసరావు, ఎంపీపీ కనుమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, మండల ఉపాధ్యక్షుడు రామకుర్తి నాగేశ్వరరావు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్, యూత్ సెల్ కార్యదర్శి మద్దుల రాజా, అధికార ప్రతినిధి ఇంజేటి నీలిమజూనియర్, రామిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ పాము మాన్‌సింగ్, అంబటి నాగేంద్రప్రసాద్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


