చంద్బరాబు సర్కారు ఆర్భాటాలు శృతి మించిపోయాయి. అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు పసుపురంగు వేసి ఓ మూడు ఇళ్లకు తోరణాలు కట్టి అప్పటికప్పుడు తలుపు బిగించి గృహాప్రవేశాలు చేయిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు. లబ్ధిదారులకు తాళం చెవి ఇచ్చి గృహప్రవేశాలు అయిపోయాయి అన్నారు. తమ ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చిందంటూ ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. తీరా పరిశీలించగా మొక్కలతో నిండిపోయి కనీసం కరెంట్ సదుపాయం, బాత్‌రూంలు లేకుండా గృహ ప్రవేశాలు చేయించారు. ఇంటికి ఒక ద్వారం బిగించి మిగతావి వదిలేశారు. ఇలాంటి ఇళ్లకు గృహ ప్రవేశాలు అవసరమా అంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. ఏలూరు శివారు మాదేపల్లిలో ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే, మేయర్ గృహప్రవేశం చేయించి లబ్ధిదారులకు తాళం చెవి ఇచ్చిన ఇళ్లు ఇవే. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు
● కూటమి కలరింగ్
● కూటమి కలరింగ్
● కూటమి కలరింగ్
● కూటమి కలరింగ్


