ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
ఆగిరిపల్లి: మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూము లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పీఎన్వీ ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం సాక్షిలో ‘పచ్చనేత భూకబ్జా’ కథనం ప్రచురితమైంది. స్పందించిన తహసీల్దార్ విచారణకు ఆదేశించారు. శనివారం ఆర్‌ఐ యూనస్, సర్వేయర్ రామకృష్ణ, వీఆర్వో లీలారాణి మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో సర్వేనెంబర్ 61లో ఆక్రమించుకున్న ఎకరం 30 సెంట్లను పరిశీలించారు. అనంతరం వీఆర్వో మాట్లాడుతూ సర్వే నెంబర్ 61లో భూమి అటవీ భూమని, ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామని, ఆక్రమణదారుడు మరోవైపు ఆక్రమించుకున్న భూమిలో ఫెన్సింగ్ వేయడానికి ఏర్పాట్లు చేస్తుండడంతో, వెంటనే పనులు నిలిపివేయాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించామని తెలిపారు.
జంగారెడ్డిగూడెం: కార్తీక మాసం శనివారం సందర్భంగా శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో అంజన్నకు పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.5,53,300 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 5000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు తెలిపారు.
ఏలూరు(మెట్రో): జెడ్పీ యాజమాన్యంలో పనిచేస్తున్న 1 4మంది దిగువశ్రేణి సిబ్బందికి పదోన్నతి ఇచ్చారు. ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, డిప్యూటీ సీఈఓ కె.భీమేశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ, మరింత శ్రద్ధగా, సమర్థవంతంగా పనిచేయాలన్నారు.
ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఐఎఫ్‌టీయు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ తీర్మానంలో భాగంగా ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్లు ఇఫ్టూ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఇఫ్టూ అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనిన్ ఆధ్వర్యంలో ఇఫ్టూ రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తెచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఆప్కాస్‌లో ఉన్న అందరినీ పర్మినెంట్ చేయాలన్నారు.
ఏలూరు(మెట్రో): సమాచార హక్కు చట్టం జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో సభ్యులుగా ఇద్దరు కార్యకర్తల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార హక్కు చట్టం నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలని, సమాచార హక్కు చట్టంపై అవగాహన, ఆసక్తి కలిగిన వ్యక్తులు జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో సంవత్సర కాలం సభ్యులుగా ఉండేందుకు ఈ నెల 29లోగా కలెక్టరేట్‌లోని మెజిస్టీరియల్ సెక్షన్‌కు అందేలా దరఖాస్తులు పంపాలన్నారు.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు


