కూటమికి కాలం చెల్లినట్లే
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు
కొయ్యలగూడెం: వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం కూటమి ప్రభుత్వ పాతరకు కారణం కాబోతోందని జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పొంగుటూరులో సర్పంచ్ పసుపులేటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెట్టి గురునాథరావుతో కలిసి పాల్గొన్నారు. వైద్య విద్యను కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు దూరం చేయబోతోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏనాడూ కూడా సొంత బలంతో గెలవలేక పోయాడని, దత్తపుత్రుడు ఆర్భాటాన్ని ప్రజలు నమ్మబట్టే గత సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చేసిన దుష్ప్రచారమే మన ఓటమికి ప్రధాన కారణమని, ఇప్పుడు రైతులు నిజం తెలుసుకొని జగన్‌మోహన్ రెడ్డి నిజాయితీని విశ్వసనీయతను నమ్ముతున్నామని అంటున్నారన్నారు. 2029లె వైఎస్సార్సీపీ కార్యకర్తల పాలన ప్రారంభం కాబోతోందని జగన్ 2.0 కి రథసారథులు కార్యకర్తలే అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సోమరాజు, జిల్లా అధికార ప్రతినిధి దాసరి విష్ణు, జిల్లా కార్యదర్శులు గొడ్డటి నాగేశ్వరరావు, ముప్పిడి శ్రీను పాల్గొన్నారు.


