ఈగల్ టీమ్ తనిఖీలు
నిడమర్రు మండలం బువ్వనపల్లిలో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం మేరకు ఈగల్ టీమ్ సభ్యులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 8లో u
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కర్నూలు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించినట్టు ఉప రవాణా కమీషనర్ షేక్ కరీమ్ తెలిపారు. ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌గేట్, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీవోలు ఎస్‌బీ శేఖర్, ఎస్‌ఎస్ రంగనాయకులు పర్యవేక్షణలోని ప్రత్యేక బృందాలు బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలియచేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై 55 కేసులు నమోదు చేసి రూ.2.80 లక్షల జరిమానా విధించామన్నారు. ఇందులో 3 బస్సులను సీజ్ చేసినట్లు కరీమ్ తెలిపారు. సరైన ధ్రువపత్రాలు చూపని, అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరాలు, ప్యాసింజర్ జాబితా లేని ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశామన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి గోదానం, గో దత్తత పథకాలను వచ్చే నెల 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. లంపి స్కిన్ వ్యాధి తీవ్రత కారణంగా ఇటీవల ఈ పథకాలను దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మళ్లీ వీటిని పునః ప్రారంభిస్తోంది. దానంగా ఇచ్చే ఆవులు, దూడలతో పాటు గతంలో వాటికి గాలి కుంటు, ముద్దచర్మ వ్యాధులు సోకలేదని మండల పశువైద్యాధికారి ధృవీకరించిన పత్రాన్ని తప్పనిసరిగా తీసుకొచ్చి ఇవ్వాలని సూచించారు.


